అన్వేషించండి

Ranji Trophy 2024: ఇదేం స్పిన్‌ మాయ సామి, 54 బంతుల్లో 53 డాట్సే

Ranji Trophy 2024: విదర్భ-మణిపూర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర రికార్డు నమోదైంది. విదర్భ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆదిత్య సర్వతె.... అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ(Ranji Trophy 2024)లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాటర్లు భారీ ఇన్నింగ్సులతో చెలరేగుతుండగా.. బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో మెరుస్తున్నారు. తాజాగా విదర్భ-మణిపూర్‌(Vidarbha Vs Manipur) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర రికార్డు నమోదైంది. విదర్భ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆదిత్య సర్వతె (Aditya Sarwate) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన ఆదిత్య సర్వతె తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం తొమ్మిది ఓవర్లు వేశాడు. అంటే 54 బంతులు వేశాడు. ఈ 54 బంతుల్లో 53 బంతులు డాట్‌ బాల్స్‌ కావడం విశేషం. అంటే మణిపూర్‌(Manipur) బ్యాటర్లు కేవలం ఒక్క బంతికి మాత్రమే ఒక్క పరుగు తీశాడు. ఇలా డాట్స్‌ వేసి సర్వతే అరుదైన ఘనత సాధించాడు. అంతేనా నాలుగు వికెట్లు కూడా తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆదిత్య విజృంభించడంతో ఈ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసి విదర్భ ఘన విజయాన్ని అందుకుంది. 
 
మ్యాచ్‌ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మణిపూర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్‌ అయింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య 9 ఓవర్లు బౌలింగ్‌ చేసి 8 మెయిడిన్లు చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 80.3 ఓవర్లలో 230 పరుగులుకు ఆలౌట్‌ అయింది. బౌలింగ్‌లో రాణించిన ఆదిత్య.. బ్యాటింగ్‌లో కూడా 69 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మణిపూర్‌.. 32 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఆదిత్య.. 11 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఆరు మెయిడిన్లు చేసి పది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో కూడా అతడు ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా విదర్భ.. 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆదిత్య సర్వతె రెండు ఇన్నింగ్సుల్లో కలిసి 19 ఓవర్లు వేసి 14 మెయిడిన్లు వేసి 16 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.
 
హైదరాబాద్‌ ఘన విజయం 
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయపై ఇన్నింగ్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో.. మేఘాలయాను హైదరాబాద్‌ జట్టు చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్‌’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్‌ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్‌ కిషన్‌ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్‌ బౌలర్లలో సాకేత్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ హైదరాబాద్‌ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రోహిత్‌ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్‌ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మేఘాలయను హైదరాబాద్‌ బౌలర్లు  154 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దీంతో మేఘాలయపై ఇన్నింగ్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget