VVS Laxman: టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్! , కొనసాగేందుకు ద్రావిడ్ విముఖత
Indian cricket team new coach: రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా కొనసాగేందుకు విముఖత చూపడంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.
![VVS Laxman: టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్! , కొనసాగేందుకు ద్రావిడ్ విముఖత Rahul Dravid not keen on contract extension VVS Laxman set to be next India head coach VVS Laxman: టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్! , కొనసాగేందుకు ద్రావిడ్ విముఖత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/d21024e33672c3754b1bccf7ac5df5ec1700799809096872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
VVS Laxman: టీమిండియా(Team India)కు కొత్త ప్రధాన కోచ్ రావడం దాదాపు ఖాయమైపోయింది. భారత్(Bharat) వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్(World Cup)తో కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Drevid) పదవీకాలం ముగిసింది. రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ(BCCI) సిద్ధంగా ఉన్నా కొనసాగేందుకు 'ది వాల్' విముఖత చూపినట్లు తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడని, అదే విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడని ఓ అధికారి తెలిపారు. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా కొనసాగేందుకు విముఖత చూపడంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లు టీ20ల సిరీస్‌లోనూ భారత జట్టుకు లక్ష్మణే ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ NCA చీఫ్‌గాను ఉన్న లక్ష్మణ్.. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరైనప్పుడు కొన్ని సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసేందుకు లక్ష్మణ్ ఆసక్తిగా ఉన్నాడని... బీసీసీఐ పెద్దలను కూడా లక్ష్మణ్ కలిశాడని తెలుస్తోంది.
వచ్చే దక్షిణాఫ్రికా పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం తథ్యమని... అతడి నేతృత్వంలో జట్టు సఫారీ జట్టును ఎదుర్కొంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్‌కు సౌతాఫ్రికా పర్యటన అవుతుందని తెలిపాయి. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ల పదవీకాలం కూడా ప్రపంచకప్‌తోనే ముగిసింది. వాళ్లు కొనసాగవచ్చు లేదా ఇతర కోచ్‌లలాగే లక్ష్మణ్ కూడా తనకు నచ్చిన సహాయ సిబ్బందిని ఎంచుకోవచ్చని బోర్డు అధికారి చెప్పారు.
బీసీసీఐ ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల పాటు టీమిండియాకు కోచ్‌గా ఉన్నాడు. ఈ రెండేళ్ల కాలంలో ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్‌లలో రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు టీమిండియాను ది వాల్ తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు. 2021లో భారతజట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు రాహుల్ ద్రావిడ్. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో అద్భుతమైన జట్టుతో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నానని... అన్ని విభాగాల్లో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఈ జట్టుతో కలిసి పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ద్రవిడ్ తెలిపాడు. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని... జట్టును అద్భుతంగా నడిపించాడని రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
చర్చకైనా, సమావేశాలకైనా రోహిత్ ఠంచనుగా వచ్చేస్తాడని.. ప్రతి మ్యాచ్ కోసం ముందే పక్కాగా ప్లానింగ్ ఉంటుందని ది వాల్ కొనియాడాడు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ తీవ్ర నిరుత్సాహానికి గురైందని... వారిని ఇలా చూడటం బాధగా ఉందన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారని ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారని ద్రవిడ్ వెల్లడించాడు. వచ్చేఏడాది జరిగే టీ 20 ప్రపంచకప్‌నకు కోచింగ్ బాధ్యతలు స్వీకరిస్తారా అనే దానికి కూడా రాహుల్ ద్రావిడ్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరని ఇప్పటికైతే తన వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)