By: ABP Desam | Updated at : 16 Feb 2023 03:18 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పృథ్వీ షా ( Image Source : PTI )
Prithvi Shaw:
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా స్నేహితుడి కారుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ముంబయిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటళ్లో రెండో సెల్ఫీ ఇచ్చేందుకు షా నిరాకరించడమే ఇందుకు కారణం! బుధవారం రాత్రి సహారా స్టార్ హోటల్లోని మాన్షన్ కబ్ల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని ఏబీపీ న్యూస్‌కు కొందరు చెప్పారు. సనా గిల్, శోభిత్ ఠాకూర్‌ను నిందితులుగా గుర్తించారు.
.
Oshiwara Police has registered a case against 8 persons over an alleged attack on the car of a friend of Indian cricketer Prithvi Shaw after Shaw refused to take a selife for the second time with two people: Mumbai Police
— ANI (@ANI) February 16, 2023
క్లబ్‌లో సెల్ఫీ ఇవ్వాల్సిందిగా పృథ్వీ షాను సనా, శోభిత్ సంప్రదించారు. ఇందుకు అంగీకరించిన షా ఒక సెల్ఫీ ఇచ్చాడు. అయితే నిందితులు మరోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు షా నిరాకరించడంతో వాగ్వాదం చెలరేగింది. దాంతో క్లబ్ మేనేజర్ వారిని బయటకు పంపించారు.
ఆగ్రహానికి గురైన నిందితులు షా అతడి స్నేహితుడు క్లబ్ బయటకు వచ్చేంత వరకు ఎదురుచూసినట్టు తెలిసింది. పృథ్వీ షా ఉన్నాడేమోనని భావించి అతడి స్నేహితుడి కారును వెంబడించారు. జోగీశ్వరీ లింక్ రోడ్‌లోని లోటస్ పెట్రోల్ పంప్ వద్ద కారుని అడ్డగించారు. బేస్‌బాల్ బ్యాటుతో కారు అద్దాలు పగలగొట్టారు. దాడి జరిగినప్పుడు పృథ్వీ షా అందులో లేడు. వేరే కారులో ఇంటికి వెళ్లాడని సమాచారం.
దాడి చేశాక నిందితులు పృథ్వీ షా స్నేహితుడిని బెదిరించారు. గొడవను అక్కడితో ఆపేసేందుకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. కాగా ఘటన జరిగాక షా మిత్రుడు ఓషివారా పోలిస్ట్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దాంతో అధికారులు సనా గిల్, శోభిత్ ఠాకూర్‌పై 384,143, 148,149, 427,504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడతామన్నారు.
Also Read: ఎవరీ చేతన్ శర్మ? ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ వీరుడు - స్టింగ్ ఆపరేషన్‌కు ఎలా చిక్కాడు!
Also Read: మొన్న నాగ్‌పుర్‌లో నేడు ఐసీసీ ర్యాంకుల్లో కేక పెట్టించిన 'స్పిన్ ట్విన్స్'!
Also Read: భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్- పలు రికార్డులకు వేదిక కానున్న ఫిరోజ్ షా మైదానం!
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌ను ఆన్లైన్లో ఎక్కడ చూడచ్చు? - టీవీలో ఏ ఛానెల్లో వస్తుంది?
Abhishek Porel: పంత్ ప్లేస్‌లో పోరెల్‌ను తీసుకున్న ఢిల్లీ - అసలు ఎవరు ఇతను?
IPL Commentators List: గేల్, డివిలియర్స్, రైనా - ఈసారి కామెంటేటర్లు మామూలుగా లేరుగా - లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!
Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు!
Shakib Al Hasan: టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు - అందుకున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!