T20 World Cup 2024: ఐసీసీ డెడ్‌లైన్‌లోపు జట్టును ప్రకటించని పాక్, కారణం ఏంటంటే!
Pakistan Cricket: టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు పిసిసి ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. అయినప్పటికీ పాకిస్తాన్ తమ జట్టును ఇంకా ప్రకటించలేదు.
![T20 World Cup 2024: ఐసీసీ డెడ్‌లైన్‌లోపు జట్టును ప్రకటించని పాక్, కారణం ఏంటంటే! Pakistan T20 World Cup 2024 Squad Not Announced Despite End Of Deadline Due To THIS Reason T20 World Cup 2024: ఐసీసీ డెడ్‌లైన్‌లోపు జట్టును ప్రకటించని పాక్, కారణం ఏంటంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/813cf511b460fc9334b102cf0699daed1714721809236872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan T20 World Cup 2024 Squad Not Announced : వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 (T20 world Cup) మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ , నేపాల్, ఒమన్‌లాంటి పలుదేశాలు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఇందుకు ఆటగాళ్ళ గాయాలు కారణమని తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక ఆలస్యం
తమ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుంన్న కారణంగానే టీ20 ప్రపంచకప్ 2024 కోసం జట్టు ఎంపిక ఆలస్యం అవుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. టీం లోని మహమ్మద్ రిజ్వాన్, ఆజామ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హారిస్ రౌఫ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారట. దీంతో టి 20 ప్రపంచకప్ ముందు జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో వారి వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ టీం ను ఎంపిక చేయాలని పీసీబీ సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం. పాకిస్తాన్ జట్టును మే 23 లేదా 24న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతర దేశాల జట్లను పరిశీలిస్తే..
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.
న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్, ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, బ్రాస్‌వెల్, చాప్‌మన్, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డరిల్ మిచెల్, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్.
నేపాల్ జట్టు :
రోహిత్ పాడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ షా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్, సందీప్ జోరా, అబినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ,
ఒమన్ జట్టు: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్ కశ్యప్, ప్రజాపతి ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్,
జూన్ 1 నుంచి ప్రారంభం
పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)