అన్వేషించండి

PAK Vs AFG: పాకిస్తాన్‌కు ఆఫ్ఘన్ల భారీ షాక్ - ఏకంగా ఎనిమిది వికెట్లతో ఘనవిజయం!

2023 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది.

PAK Vs AFG: 2023 ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (87: 113 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (65: 53 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రహ్మత్ షా (77 నాటౌట్: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (87: 113 బంతుల్లో, 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (65: 53 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రహ్మత్ షా (77 నాటౌట్: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఎక్కడా తడబడకుండా...
283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను సాధికారికంగా ప్రారంభించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (65: 53 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), ఇబ్రహీం జద్రాన్ (87: 113 బంతుల్లో, 10 ఫోర్లు) వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 21.1 ఓవర్లలోనే 131 పరుగులు జోడించారు. ముఖ్యంగా రహ్మనుల్లా గుర్బాజ్ బౌండరీలతో చెలరేగాడు.

రెండో వికెట్‌కు ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా (77 నాటౌట్: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను స్టేబుల్ చేశారు. అనంతరం ఇబ్రహీం జద్రాన్ అవుటైనా... రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. వీరు మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.

బాబర్ ఆజం, అబ్దుల్లా షఫీక్ హాఫ్ సెంచరీలు
అంతకు ముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (17: 22 బంతుల్లో, రెండు ఫోర్లు)... పాకిస్తాన్‌కు శుభారంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కేవలం 10.1 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని అజ్మతుల్లా విడదీశాడు. ఇమామ్ ఉల్ హక్‌ను అవుట్ చేశాడు.

అబ్దుల్లా షఫీక్ రెండో వికెట్‌కు బాబర్ ఆజంతో (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించింది. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు. రాగానే సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన మహ్మద్ రిజ్వాన్ (8: 10 బంతుల్లో, ఒక సిక్సర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత సౌద్ షకీల్ (25: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), బాబర్ ఆజం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజం అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే క్రీజులో కుదురుకుంటున్న దశలో సౌద్ షకీల్ అవుటయ్యాడు. కాసేపటికే బాబర్ ఆజం కూడా పెవిలియన్ బాట పట్టడంతో పాకిస్తాన్ 209 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చివరి ఓవర్లలో షాదాబ్ ఖాన్ (40: 38 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఇఫ్తికర్ అహ్మద్ (40: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పాకిస్తాన్‌ను ఆదుకున్నారు. వీరు చాలా వేగంగా పరుగులు చేశారు. ఈ జోడి ఆరో వికెట్‌కు 7.3 ఓవర్లలోనే 73 పరుగులు జోడించింది. ముఖ్యంగా వీరిద్దరిలో ఇఫ్తికర్ అహ్మద్ సిక్సర్లతో చెలరేగాడు. మరోవైపు షాదాబ్ ఖాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ తనకు చక్కటి సహకారం అందించాడు. అయితే చివరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Embed widget