By: ABP Desam | Updated at : 30 Apr 2023 11:47 PM (IST)
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫొటో) ( Image Source : PTI )
Ravi Shastri On Virat Kohli: భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లీపై చేసిన ప్రకటనతో సంచలనం సృష్టించాడు. రవి శాస్త్రి తెలుపుతున్న దాని ప్రకారం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా కారణంతో ఏ మ్యాచ్ ఆడకపోతే, అటువంటి పరిస్థితిలో ఆ మ్యాచ్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీకి జట్టు కెప్టెన్సీ ఇవ్వాలి.
గత ఏడాది ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు తను అక్కడ ఉండి ఉంటే, రోహిత్ ఔటైన తర్వాత కెప్టెన్సీకి విరాట్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నానని రవిశాస్త్రి తెలిపారు. రాహుల్ ద్రవిడ్ కూడా అలాంటి పని చేసి ఉంటాడని తను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపాడు.
రవి శాస్త్రి తన ప్రకటనలో ఇంకా మాట్లాడుతూ ‘జట్టు 2-1తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో విరాట్ భాగమైనందున, ఈ మ్యాచ్‌కు విరాట్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని నేను ఆ సమయంలో బోర్డుకు సలహా ఇచ్చాను.’ అన్నాడు.
రోహిత్ ఫిట్‌గా లేకుంటే విరాట్‌కు కెప్టెన్సీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి రవిశాస్త్రి తన ప్రకటనలో రోహిత్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్నందున ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని చెప్పాడు. కొన్ని కారణాల వల్ల అతను పూర్తిగా ఫిట్‌గా లేకపోతే అటువంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీ ఈ బాధ్యతను నిర్వర్తించేలా చూడాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.
భారత జట్టు జూన్ 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఆఖరి మ్యాచ్‌ను ఆడవలసి ఉంది దీని కోసం సెలెక్టర్లు ఏప్రిల్ 24వ తేదీన టీమ్ ఇండియాను కూడా ప్రకటించారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను దూరం కాక తప్పదని భావిస్తున్నారు. ఇదే జరిగితే టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే.
ఉమేష్ యాదవ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ నుంచి ఉమేష్ యాదవ్ తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే ఉమేష్ యాదవ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో రాబోయే మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడతాడా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే అతను గాయం నుండి కోలుకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపించవచ్చు.
ఉమేష్ యాదవ్ గాయం భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు శుభవార్త కాదు. ఎందుకంటే భారత జట్టులో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాలతో పోరాడుతున్నారు. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడరు. ప్రస్తుతం భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఈ గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ప్లేయర్ల ఎంపికను పరిశీలిస్తోంది.
IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు
WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్
Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్
IND vs AUS, WTC Final 2023: వార్నర్ ఔట్ - పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
WTC Final 2023: ప్చ్.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్! అజింక్య సెంచరీ మిస్ - ఆసీస్‌కు భారీ లీడ్!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?