అన్వేషించండి

ODI World Cup 2023: అక్షర్ వర్సెస్ చాహల్ - టీమిండియా తప్పు చేసిందా?

వన్డే వరల్డ్ కప్‌లో ఎంపిక చేసిన జట్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనబెట్టి అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ODI World Cup  2023: మరో 26 రోజులలో  స్వదేశంలో  మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌లో  పాల్గొనేందుకు గాను బీసీసీఐ ఇటీవలే 15 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.   దాదాపు ముందుగా ఊహించిన ఆటగాళ్లే జట్టులో ఉన్నప్పటికీ  టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిని కాదని   స్పిన్ బాధ్యతలతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడనే ఉద్దేశంతో  సెలక్టర్లు  అక్షర్ పటేల్ వైపునకు మొగ్గుచూపారు. బ్యాటింగ్‌లో డెప్త్ (లోతు) కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని  కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు  చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.  కానీ టీమిండియాకు రాబోయే వరల్డ్ కప్‌లో ఈ నిర్ణయం  ఏ మేరకు లబ్ది చేకూర్చుతుంది..?

అక్షర్ అంతంతమాత్రమే.. 

వన్డేలలో 2014లో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ ఇప్పటివరకూ భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నా తనదైన ముద్ర వేయలేకపోయాడు. 9 ఏండ్ల తన వన్డే కెరీర్‌లో 52 మ్యాచ్‌లు ఆడిన అక్షర్..  బ్యాటింగ్‌లో చేసింది  413 పరుగులు మాత్రమే. సగటు 18.77 గా ఉంది.  2022 వరకూ అడపాదడపా వన్డేలలో ఆడినా  గతేడాది నుంచి దాదాపు వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయిన అక్షర్.. గత  పది వన్డేలలో  చేసిన పరుగులు 1, 2, 29, 21, 20, 56, 1, 6, 64, 21  (మొత్తంగా 221). తీసిన వికెట్లు 12. అక్షర్ పటేల్ బౌలింగ్ సగటు  32కు చేరువగా ఉంది.

చాహల్ మచ్ బెటర్.. 

2016లో  వన్డేలలో ఎంట్రీ ఇచ్చిన చాహల్  మణికట్టు స్పిన్నర్‌గా తనకు ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.  కెప్టెన్ బంతిని ఇచ్చిన ప్రతీసారి వికెట్లను తీశాడు.  తన కెరీర్‌లో ఇప్పటివరకూ 72 వన్డేలు ఆడిన చాహల్.. 121 వికెట్లు తీశాడు.  చాహల్ బౌలింగ్ సగటు  27గా ఉంది. చాహల్ ఆడిన గత పది వన్డేలలో 17 వికెట్లు పడగొట్టాడు.  స్వదేశంలో స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై మరింత ప్రభావం చూపే చాహల్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు. పూర్తిస్థాయి స్పిన్నర్ అయిన చాహల్ బ్యాటింగ్  చేయలేడు. ఇంతవరకూ వన్డేలలో  14 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన చాహల్.. 77 రన్స్ చేశాడు. 

 

బ్యాటింగ్ డెప్త్ ఎక్కడ..? 

గణాంకాలపరంగా  అంతంతమాత్రంగానే ఉన్న అక్షర్‌‌ను ఇతర జట్లలో సెలక్టర్లు అయితే ఎంపిక చేసేవారే కాదన్న విమర్శలు ఉన్నాయి.  ఇటీవల కాలంలో అక్షర్ ఫామ్ దారుణంగా ఉంది. వరుసగా విఫలమవుతున్నా  అవకాశాలు దక్కించుకున్న అక్షర్‌ను బ్యాటింగ్‌లో లోతు కోసం ఎంపిక చేసినా గత  10 ఇన్నింగ్స్‌లలో అతడి గణాంకాలు కూడా అంత గొప్పగా ఏంలేవు. బౌలింగ్‌లో చూస్తే అక్షర్.. చాహల్ కంటే గొప్ప టర్నర్ కూడా కాదు. మరి ఇలాంటి ఆటగాడి కోసం తన స్పిన్ మాయాజాలంతో  ప్రత్యర్థులను బెంబేలెత్తించే   చాహల్‌ను పక్కనబెట్టడం  వెనుక మర్మమేంటో సెలక్టర్లకే తెలియాలి.

గడిచిన నాలుగేండ్లలో.. 

అదీగాక 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత  భారత్ ఆడించిన నలుగురు ప్రధాన స్పిన్నర్లలో  చాహల్‌కే  మెరుగైన రికార్డు ఉంది. గడిచిన నాలుగేండ్లలో చాహల్‌ 21 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి  28 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు.   ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న  కుల్దీప్ యాదవ్.. 34 మ్యాచ్‌లు ఆడి  32 సగటుతో 48 వికెట్లు తీశాడు.  రవీంద్ర జడేజా 23 వన్డేలలో ఏకంగా 45 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 13 వన్డేలలో 13 వికెట్లు తీశాడు.  వచ్చిన అవకాశాలు తక్కువే అయినా  చాహల్..   మిగిలిన ముగ్గురు  స్పిన్నర్ల కంటే మెరుగ్గానే రాణించాడు. 

జట్టులో టెయిలెండర్లు బ్యాటింగ్ చేయడం ముఖ్యమే గానీ దాని కారణంగా ప్రధాన  బౌలర్లను కూడా కాదని  పార్ట్ టైమ్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం..? అయినా  ప్రతీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను  ఆడిస్తారా..? రోహిత్, కోహ్లీ, గిల్,  శ్రేయాస్, రాహుల్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా దాకా బ్యాటర్లే ఉన్నా ఇంకెంతమంది  బ్యాటింగ్ చేస్తారు..? అయినా జట్టులో జడేజా రూపంలో ఓ స్పిన్ ఆల్ రౌండర్ ఉండగా మళ్లీ అక్షర్ ఎందుకు..?  ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం తేలని ప్రశ్నలే..!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget