అన్వేషించండి

IND Vs PAK Live: 19 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్‌పై భారత్ విక్టరీ - పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి!

ODI World Cup 2023, IND Vs PAK: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Key Events
ODI World Cup 2023 Live Updates India playing against Pakistan match highlights commentary score Narendra Modi Stadium IND Vs PAK Live: 19 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్‌పై భారత్ విక్టరీ - పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి!
ఇండియా, పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Source : ICC X/Twitter

Background

IND Vs PAK Live Score: ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. 2023 ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రణ క్షేత్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య పోరును సాధారణ మ్యాచ్‌ల కాకుండా రెండు దేశాల అభిమానలు ఓ యుద్ధంలా చూస్తారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు కనురెప్ప కూడా ఆర్పకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. క్రికెట్‌ ప్రపంచమే ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది.
 
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ నేడు తలపడతాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో  సారథి రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడం సహా బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా మెరుపులు భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా నిలిపాయి. 1992 నుంచి ఇప్పటివరకూ రెండు జట్లు ప్రపంచ కప్‌లో ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్‌ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లురుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తుంది. డెంగ్యూ నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో గిల్‌ ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. శుభ్‌మన్‌ తుది జట్టులో లేకపోతే ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. 
 
బౌలింగ్‌ విభాగంలోనూ భారత్‌ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. స్టార్‌ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా రాణిస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ స్తానంలో మహ్మద్‌ షమీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తే శార్దూల్‌ ఠాకూర్‌ స్తానంలో రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు బౌలింగ్‌ విభాగంలో పెద్దగా సమస్యలు లేవు. అయితే బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ జట్టు పూర్తిగా సారథి బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
 
ఈ మ్యాచ్‌లో గెలిచి భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం కోసం మైదానంలోకి దిగనుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్ జట్లు మొత్తం ఏడుసార్లు తలపడగా, అందులో టీమ్‌ఇండియా అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో రెండు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ జరిగిన ప్రతీసారీ టీమిండియానే గెలిచింది.
 
ప్రపంచ కప్‌నకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
 
ప్రపంచ కప్‌నకు పాకిస్తాన్ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వాసిం

20:09 PM (IST)  •  14 Oct 2023

బౌండరీతో మ్యాచ్ ముగించిన శ్రేయస్ అయ్యర్ - 19 ఓవర్లు మిగిలి ఉండగానే!

పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లతో భారీ విజయం సాధించింది. 31వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్: 62 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) బౌండరీతో మ్యాచ్ గెలిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.

20:05 PM (IST)  •  14 Oct 2023

30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 186-3

30 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హసన్ అలీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.

శ్రేయస్ అయ్యర్ (48: 60 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)
కేఎల్ రాహుల్ (18: 28 బంతుల్లో, రెండు ఫోర్లు)

హసన్ అలీ: 6-0-34-1

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget