![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SA vs AFG: ప్రొటీస్ ముందు 245 పరుగుల లక్ష్యం , ఛేజింగ్ వీక్‌నెస్‌ను సఫారీలు ఛేదిస్తారా
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా మరో విజయానికి మార్గం సుగుమం చేసుకుంది. అద్భుతాలు సృష్టిస్తున్న అఫ్ఘానిస్థాన్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది.
![SA vs AFG: ప్రొటీస్ ముందు 245 పరుగుల లక్ష్యం , ఛేజింగ్ వీక్‌నెస్‌ను సఫారీలు ఛేదిస్తారా ODI World Cup 2023 Afghanistan give target 245 runs against South Africa Innings highlights Narendra Modi Stadium SA vs AFG: ప్రొటీస్ ముందు 245 పరుగుల లక్ష్యం , ఛేజింగ్ వీక్‌నెస్‌ను సఫారీలు ఛేదిస్తారా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/eff2de510f8102327d15b9cbe35a85801699619926026872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా మరో విజయానికి మార్గం సుగుమం చేసుకుంది. ఈ మహా సంగ్రామంలో అద్భుతాలు సృష్టిస్తున్న అఫ్ఘానిస్థాన్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఒమ్రాజాయ్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. 107 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఒమ్రాజాయ్ 97 పరుగులు అజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో అఫ్గాన్ జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే సెమీస్ ద్వారాలు మూసుకుపోవడంతో అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో 400కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్ సెమీస్ పోరాటానికి తెరపడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ జోడీని కేశవ్ మహరాజ్ విడదీశాడు. 22 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 25 పరుగులు చేసిన రహ్మతుల్లా గుర్బాజ్‌ను కేశవ్ మహరాజ్ అవుట్ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. అదే స్కోరు వద్ద ఇబ్రహీం జర్దాన్ కూడా పెవిలియన్ చేరాడు. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో హస్మతుల్లా షాహీదీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 41 పరుగుల వద్ద ఒక్క వికెట్ కోల్పోని అఫ్గాన్ 45 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో అజ్మతుల్లా ఒమ్రాజాయ్ అఫ్గాన్‌ను ఆదుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. రహ్మత్ షాతో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ వైపు సఫారీ బౌలర్లు వికెట్లును తీస్తూ వచ్చారు. 46 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన రహ్మత్ షాను ఎంగిడి అవుట్ చేశాడు.
14 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇక్రమ్ అలిఖిల్... 2 పరుగులు చేసిన మహ్మద్ నబీ..14 పరుగులు చేసి రషీద్ ఖాన్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 116 పరుగులకే అఫ్గాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఒమ్రాజాయ్ పోరాడాడు. టెయిలెండర్లతో కలిసి అఫ్గాన్‌కు పోరాడే స్కోరును అందించాడు. 107 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఒమ్రాజాయ్ 97 పరుగులు అజేయంగా నిలిచాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉన్న దశలో ఒమ్రాజాయ్ సెంచరీ చేస్తాడని అనుకున్నా నవీన్ ఉల్ హక్ రనౌట్ కావడంతో ఆ ఆశ నెరవేరలేదు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ బౌలర్లలో కోట్జే నాలుగు, ఎంగిడి రెండు, మహరాజ్ రెండు వికెట్లు తీశాడు.
ఈ ప్రపంచకప్‌లో తమ పోరాటంతో అఫ్గానిస్థాన్ క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేయాలని అఫ్గాన్ పట్టుదలతో ఉంది. ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ మంచి ప్రదర్శన చేయాలని అఫ్గాన్ భావిస్తోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న అఫ్గాన్.. అద్భుతం సృష్టించగలమన్న నమ్మకంతో ఉంది. ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించిన హస్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టుకు... సఫారీ జట్టును లక్ష్యాన్ని ఛేదించనీయకుండా చేయాలని చూస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)