Asia Cup 2023: ప్చ్, ఆ ఇద్దరి ఫైట్ మిస్ అయ్యాం! - అఫ్గాన్ జట్టులో లేని మ్యాంగో మ్యాన్ - నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్
ఈ ఏడాది మేలో ముగిసిన ఐపీఎల్-16లో అత్యంత వివాదాస్పదమైన కోహ్లీ - నవీన్ ఉల్ హక్ గొడవకు రివేంజ్ చూద్దామనుకుంటే టీమిండియా ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
Asia Cup 2023: మూడు నెలల క్రితం భారత్ వేదికగా ముగిసిన ఐపీఎల్-16లో వివాదాస్పదమైన విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మే లో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ.. బ్యాటింగ్ చేస్తున్న నవీన్ ఉల్ హక్‌ను కవ్వించడం, స్లెడ్జింగ్ చేయడంతో అతడు కూడా దానికి దీటుగానే బదులివ్వడం, ఇరువురి మధ్య సోషల్ మీడియా ఫైట్‌తో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వివాదం సాగింది.
అయితే ఆర్సీబీ ఐపీఎల్ - 16లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఈ ఇద్దరి మధ్య మరో ఫైట్ చూద్దామనుకున్న అభిమానులను నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆసియా కప్‌లో అయినా నవీన్.. అఫ్గాన్ టీమ్‌లో ఉంటే భారత్ - అఫ్గాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి రైవల్రీ వీక్షిద్దామనుకున్న కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా కప్‌లో ఆడబోయే అఫ్గాన్ జట్టులో నవీన్ ఉల్ హక్ కు చోటు దక్కలేదు. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు.
ఐపీఎల్-16లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరకపోయినా జూన్ లేదా జులైలో అఫ్గాన్ జట్టు భారత పర్యటనకు వస్తుందని, అప్పుడు కోహ్లీ - నవీన్ ఫైట్‌ను చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు అప్పుడు నిరాశే ఎదురైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి వచ్చిన భారత్.. నేరుగా విండీస్ పర్యటనకే వెళ్లింది. అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ వచ్చే ఏడాది జనవరికి వాయిదాపడింది. కానీ ఆసియా కప్‌లో అయినా కోహ్లీ - నవీన్ ఫైట్ చూద్దామనుకుంటే.. అఫ్గాన్ పేసర్ జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలం కావడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇందుకు సంబంధించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ ఫైట్ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్.. నవీన్‌ను మ్యాంగో మ్యాన్ అని పిలిచి దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. ముంబై ఇండియన్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ను టీవీలో చూస్తున్నానని చెబుతూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను తీసి ఇన్‌స్టాలో షేర్ చేయడం అతడి పాలిట శాపమైంది. అప్పట్నుంచి కోహ్లీ ఫ్యాన్స్ అతడిని మ్యాంగో మ్యాన్ అని పిలుస్తూ ఆటాడుకున్నారు.
❗ Fareed Ahmad has been dropped from Afghanistan's 🇦🇫 AC squad as he'd abused Babar Azam & Imam during the series, Karim Janat has been appointed as his replacement
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) August 27, 2023
No Naveen Ul Haq in the squad either who also ill-treated Virat Kohli during an IPL clash lately🤯#AsiaCup2023 pic.twitter.com/X11GRFIqrX
We will sadly miss the spectacle of Virat Kohli giving Naveen Ul Haq's bowling a one-way ticket to the stands! 😉😉
— Vipin Tiwari (@vipintiwari952) August 27, 2023
Naveen ul haq misses out from Afghanistan’s Squad for Asia cup 2023. pic.twitter.com/bAh9PznTk3
ఇక ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అఫ్గానిస్తాన్ తరఫున ఆడిన పేసర్ ఫరీద్ అహ్మద్‌కు కూడా ఆ జట్టులో చోటు దక్కలేదు. పాక్- అఫ్గాన్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఫరీద్.. బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్‌లపై నోరు పారేసుకున్నాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఓమర్జై, షాహిదుల్లా కమల్, వఫాదర్ మొమండ్‌లు కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఆరేండ్ల తర్వాత ఆ జట్టు ఆల్ రౌండర్ కరీమ్ జనత్ అఫ్గాన్ టీమ్‌లోకి వచ్చాడు. పలు మార్పులు మినహా దాదాపు ఇటీవల పాకిస్తాన్‌తో తలపడిన జట్టే ఆసియా కప్ ఆడనుంది.
Naveen Ul Haq's latest Instagram story 👀
— Farid Khan (@_FaridKhan) August 27, 2023
This could mean he's not injured and in fact dropped from the Asia Cup 2023 squad by Afghanistan. Blocked me during the IPL, and we won't be able to see Naveen vs Virat Kohli in Asia Cup now 😔 #AsiaCup2023 pic.twitter.com/GilXSxpZt2
ఆసియా కప్‌కు అఫ్గాన్ జట్టు : హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలిఖిల్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజిబుల్లా జద్రాన్, మహ్మద్ నబి, కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రహమాన్, షరాపుద్దీన్ అష్రాఫ్, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం సఫి, ఫజల్ హక్ ఫరూఖీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial