News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nicholas Pooran: నికోలస్ పూరన్‌కు ఐసీసీ షాక్ - మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా!

భారత్, వెస్టిండీస్ జట్ల జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు నికోలస్ పూరన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.

FOLLOW US: 
Share:

Nicholas Pooran: ఐదు టీ20ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ కేవలం 40 బంతుల్లో 67 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అయితే అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం నికోలస్ పూరన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నికోలస్ పూరన్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

గయానా టీ20 తర్వాత నికోలస్ పూరన్ అంపైరింగ్‌ను బహిరంగంగా విమర్శించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌పై ఫైన్ విధించారు. ఈ విషయంలో నికోలస్ పూరన్‌ను లెవెల్-1 కింద దోషిగా నిర్థారించారు. ఆ తర్వాత ఐసీసీ ఆర్టికల్ 2.7 ప్రకారం నికోలస్ పూరన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

ఐసీసీ ఆర్టికల్ 2.7 ప్రకారం ఒక ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్‌లొ జరిగిన ఏదైనా జరిగిన సంఘటనను బహిరంగంగా ఖండిస్తే, అది ఐసీసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ నికోలస్ పూరన్ కూడా తన తప్పును అంగీకరించాడు.

సిరీస్‌లో 2-0తో వెస్టిండీస్ ఆధిక్యం
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ అద్భుత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో కరీబియన్‌ జట్టు 2-0తో ముందంజ వేసింది. తొలి మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ మంగళవారం నాడు జరగనుంది.

Published at : 07 Aug 2023 11:59 PM (IST) Tags: IND vs WI Nicholas Pooran IND Vs WI 2nd T20I Nicholas Pooran Fined

ఇవి కూడా చూడండి

Top 5 Wicket Keepers: 2023 ప్రపంచకప్‌లో డేంజరస్ వికెట్ కీపర్లు వీరే - టాప్-5 లిస్ట్‌లో ఎవరున్నారు?

Top 5 Wicket Keepers: 2023 ప్రపంచకప్‌లో డేంజరస్ వికెట్ కీపర్లు వీరే - టాప్-5 లిస్ట్‌లో ఎవరున్నారు?

ICC World Cup 2023: వరల్డ్ కప్ కామెంటరీకి ప్రత్యేక సన్నాహాలు - 120 మందితో తొమ్మిది భాషల్లో!

ICC World Cup 2023: వరల్డ్ కప్ కామెంటరీకి ప్రత్యేక సన్నాహాలు - 120 మందితో తొమ్మిది భాషల్లో!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?

Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?

World Cup Record: పాకిస్థాన్‌తో పాటు ఈ జట్లేవీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి, ఆ జట్లు ఏవంటే?

World Cup Record: పాకిస్థాన్‌తో పాటు ఈ జట్లేవీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి, ఆ జట్లు ఏవంటే?

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!