అన్వేషించండి

MS Dhoni: అభిమానుల కోసమే ఇలా! ధోనీ జవాబుకు ఫ్యాన్స్‌ ఫిదా

MS Dhoni: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తన ఆట తీరు, వ్యక్తిత్వంతో అందరికీ మార్గనిర్దేశకుడిగా ఆరాధ్యుడిగా మారిపోయాడు. అందుకే ధోనీకి  సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్‌గా మారుతుంది. ఇక ధోనీ హెయిర్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎప్పుడూ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌తో అభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. తాజాగా మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల మహీ కొత్త హెయిర్‌ స్టైల్‌ను ట్రై చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఈ హెయిర్‌ స్టైల్‌తో చాలా స్టైలిష్‌ లుక్‌తో ధోని అదిరిపోతున్నాడు. కొత్త త‌ర‌హా హెయిర్ స్టైల్‌తో డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ త‌న త‌ల వెంట్రుక‌ల్ని పెంచేశాడు. అయితే, తన హెయిర్‌ స్టైల్స్‌ వల్ల కలిగే ఇబ్బందుల గురించి మిస్టర్‌ కూల్‌ తాజాగా వివరించాడు.
 
గతంలో యాడ్‌ ఫిల్మ్‌ల కోసం వెళ్లినప్పుడు తన  హెయిర్ స్టైల్‌, మేకప్‌ కోసం కేవలం 20 నిమిషాల సమయం తీసుకునేవాడినని ధోని గుర్తు చేసుకున్నాడు. ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారని లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాని... అయితే యాడ్స్ షూటింగ్‌ కోసం రెడీ అవ్వడానికి లాంగ్ హెయిర్ వల్ల ఆలస్యం అవుతోందని ధోని షూటింగ్‌ బాధలు తెలిపాడు. గతంలో 20 నిమిషాల్లో పట్టే మేకప్‌ ఇప్పుడు గంట పడుతుందని వెల్లడించాడు. గంటల పాటు అలానే కూర్చుని సిద్ధం కావడం కాస్త బోరింగ్‌ అనిపిస్తోందని కూడా తెలిపాడు. ఇంత హెయిర్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం అంత ఈజీ కాదని... ఫ్యాన్స్‌ కోసం మరి కొంతకాలం ఇలానే ఉంచడానికి ప్రయత్నిస్తానని ధోని వెల్లడించాడు. 
 
ధోనీ సమాధానానికి ఫిదా
క్రికెట్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అని ఓ ప్రశ్న ధోనీకి ఎదురైంది. మాములుగా అయితే మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలుగా మారుతాం క్రికెట్ అకాడమీలు పెడతామని చెప్తారు. కానీ అక్కడున్నది ధోనీ కదా అందుకే మరోలా స్పందించాడు. ఇప్పటివరకైతే తాను దాని గురించి ఆలోచించలేదని... కానీ క్రికెట్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత ఆర్మీలో ఎక్కువ సమయం గడుపుతానంటూ ధోనీ జవాబు ఇచ్చాడు. కొన్నేళ్లుగా తాను భారత సైన్యంతో ఎక్కువ సమయం గడపలేదని.. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ధోనీ అన్నాడు. ఎంఎస్ ధోనీ సమాధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇంకా ధోనీ మాట్లాడుతూ తాను ఇప్పటికీ క్రికెట్‌ ఆడుతున్నాని.. క్రికెట్‌ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే తనకు ఆసక్తికరంగానే ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్‌ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.
 
మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
I Bomma: ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
Embed widget