News
News
X

2023 వన్డే వరల్డ్‌కప్‌ టీమిండియా జట్టులో చోటు ఖాయం చేసుకున్న సిరాజ్‌!

2022 ఆరంభం నుంచి వన్డేల్లో తొలి పవర్ ప్లేలో అంటే 1-10 ఓవర్స్ మధ్య ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్. ఇది కేవలం ఇండియన్ బౌలర్స్ రికార్డు కాదు వరల్డ్‌ రికార్డు.

FOLLOW US: 
Share:

2017, 18 నాటికి వెళ్దాం. ఐపీఎల్ లో మహ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండేదేం కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు... లార్డ్ సిరాజ్ అంటూ ట్రోల్స్ ఉండేవి. ఎకానమీ, స్ట్రైక్ రేట్, యావరేజ్ పై దారుణంగా విరుచుకుపడేవారు. ఆర్సీబీ బౌలింగ్ అటాక్ పై ట్రోల్స్ అంటే.... ఫస్ట్ సిరాజ్ పైనే ట్రోల్స్ ఉండేవి. 

ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ప్రజెంట్ కి వచ్చేద్దాం. ఇప్పుడు సిరాజ్ పొజిషన్ ఏంటి..? జట్టులో మహ్మద్ షమీ సీనియర్ అయినా సరే.... పేస్ అటాక్ కు అనధికారిక లీడర్ గా మారిపోయాడు. ఆ రేంజ్ లో ఎదిగింది... సిరాజ్ కెరీర్. 2022 ముందు వరకు సిరాజ్ రెడ్ బాల్ ఎబిలిటీస్ మీద అంటే టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ మీద ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. కానీ వైట్ బాల్ మ్యాచెస్, అదే లిమిటెడ్ ఓవర్స్ కు వచ్చేసరికే ఎవరికీ నమ్మకముండేది కాదు. 

ఎంతలా అంటే 2019లో వన్డే డెబ్యూ చేశాడు. 2022 ముందువరకు ఆడిన వన్డే అదొక్కటే. కానీ జస్ ప్రీత్ బుమ్రాకు అయితే గాయాలు, లేదా విశ్రాంతి ఇవ్వడం... ఇండియన్ టీమ్ మేనేజ్ మెంట్ రొటేషన్ పాలసీ అవలంబించడంతో 2022 నుంచి నిన్నటి మ్యాచ్ దాకా సుమారు ఓ ఏడాది గ్యాప్ లోనే సిరాజ్ 19 వన్డేలు ఆడాడు.

ఈ కాలంలో అతని నంబర్స్ ఏంటో చూద్దామా...?

  

19 వన్డేలు
154.4 ఓవర్లు
37 వికెట్లు
702 రన్స్
18.97 యావరేజ్
25.08 స్ట్రైక్ రేట్
4.55 ఎకానమీ

ఓవర్లు, వికెట్ల సంగతి పక్కన పెట్టేయండి. ఆ ఆఖరి 3 స్టాట్స్ చూడండి. సుమారు 19 యావరేజ్, 25 స్ట్రైక్ రేట్, 4.5 మాత్రమే ఎకానమీ. అటాకింగ్ క్రికెట్ పాట పాడుతున్న ప్రస్తుత జనరేషన్ లో ఈ రేంజ్ నంబర్స్ అంటే బంగారమనే చెప్పుకోవాలి. 

ఇలా బయటకు కనిపించే నంబర్స్ తో పాటు ఇంకో స్టాట్ చెప్పుకుందాం. 2022 ఆరంభం నుంచి వన్డేల్లో తొలి పవర్ ప్లేలో అంటే 1-10 ఓవర్స్ మధ్య ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్. ఇది కేవలం ఇండియన్ బౌలర్స్ మాత్రమే చెప్పట్లేదండి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ దశలో ఎక్కువ వికెట్లు తీసింది సిరాజే. నిన్నటి మ్యాచ్ తో కలిపి 19 ఇన్నింగ్స్ లో కలిపి 24 వికెట్లు తీశాడు. తర్వాతి బెస్ట్ 10 వికెట్లు మాత్రమే. చూశారా ఎంత డిఫరెన్స్ ఉందో. కెప్టెన్ నమ్ముకునే బౌలర్ గా సిరాజ్ మారాడనడానికి క్లియర్ కట్ గా తెలిసొచ్చే ఉదాహరణ ఇదే. 

సిరాజ్ ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి కారణమేంటో తెలుసా..? అతని మైండ్ సెట్. ఇంతకముందు బౌలింగ్ వేసేవాడు కానీ ఓ ప్లాన్, ఎగ్జిక్యూషన్ పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు... తన బలాలు, బలహీనతలు తెలుసుకుని బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ స్థాయి ఫలితాలు. పవర్ ప్లేలో తన ఔట్ స్వింగ్ బౌలింగ్ చూసి తీరాల్సిందే. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు నాలుగో స్టంప్, ఐదో స్టంప్ లైన్ లో వేసే బంతులు... టాప్ లెవల్ స్టఫ్. 

నిన్న కివీస్ తో జరిగిన తొలి వన్డే ద్వారా మనకు తెలిసొచ్చిందేంటంటే... సిరాజ్ డెత్ బౌలింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయని. అంతటి ప్రెషర్ మ్యాచ్ లో పరుగులు తక్కువ ఇవ్వడమే కాక బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసి మ్యాచ్ ను మళ్లీ ఇండియా వైపు తిప్పాడు. సిరాజ్ పర్ఫార్మెన్స్ ను రోహిత్ శర్మ కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సిరాజ్ ఈ స్థాయిలో ఎదగడం... ప్రపంచకప్ దృష్ట్యా చాలా మంచిదన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే... ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కావాలంటే రోహిత్ శర్మ చూసేది సిరాజ్ వైపే. 

సో సిరాజ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ జట్టుకు చాలా మంచిదే. బుమ్రా ఫుల్ ఫిట్నెస్ సాధించి టీంలోకి కనుక వచ్చాడే అనుకోండి.... బుమ్రా, సిరాజ్, షమీ. వరల్డ్ కప్ కు ఇదే మన పేస్ అటాక్. తుదిజట్టులో ఉండేది వీరే. వీరికి పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ తోడు. బెంచ్ మీద బ్యాకప్ గా ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఉంటారు. బుమ్రా, సిరాజ్, షమీ... స్పిన్ డామినేట్ చేసే ఇండియన్ పిచెస్ పై ఎలాంటి బౌలింగ్ స్టైల్ ఉంటే ప్రభావవంతంగా ఉంటుందో... సరిగ్గా వీరిది అలాంటి స్టైలే. కేవలం స్వింగ్ మీదే ఆధారపడే బౌలర్స్ కాదు. అందుకే కచ్చితంగా ఇండియన్ పిచెస్ మీద ఎఫెక్టివ్ గా ఉంటారు.

సిరాజ్ ప్రస్తుతం ఎంత బలమైన బౌలర్ గా ఎదిగాడో... సింపుల్ గా ఒక్క వాక్యంలో చెప్పి ముగించేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్.... వరల్డ్ కప్ లో ప్రత్యర్థికి తగ్గట్టుగా స్ట్రాటజీ మార్చి ఉమ్రాన్ ను జట్టులోకి తీసుకురావాలనుకోండి. అప్పుడు సిరాజ్ తుదిజట్టులో ఉంటాడు. సీనియర్ షమీ బెంచ్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఆ రేంజ్ డెవలప్మెంట్ మరి మన సిరాజ్ మియాది.

Published at : 19 Jan 2023 05:27 PM (IST) Tags: Mohammed Siraj Ind Vs NZ mohammed siraj odi wickets siraj bowling figures mohammed siraj vs nz

సంబంధిత కథనాలు

U-19 Women’s T20 WC: 'ఇది ఆరంభం మాత్రమే'- టీ20 ప్రపంచకప్ విజయంపై భారత కెప్టెన్ షెఫాలీ వర్మ

U-19 Women’s T20 WC: 'ఇది ఆరంభం మాత్రమే'- టీ20 ప్రపంచకప్ విజయంపై భారత కెప్టెన్ షెఫాలీ వర్మ

Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్

Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్

Pant Health Update: పంత్ హెల్త్ అప్ డేట్- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఎప్పుడంటే!

Pant Health Update: పంత్ హెల్త్ అప్ డేట్- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఎప్పుడంటే!

Women's U-19 T20 WC: 'మహిళల క్రికెట్ లో ఇది గొప్ప రోజు'- జూనియర్ మహిళల జట్టుకు టీమిండియా శుభాకాంక్షలు

Women's U-19 T20 WC: 'మహిళల క్రికెట్ లో ఇది గొప్ప రోజు'- జూనియర్ మహిళల జట్టుకు టీమిండియా శుభాకాంక్షలు

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!