By: ABP Desam | Updated at : 16 May 2023 11:35 AM (IST)
నెహల్ వధేర ( Image Source : Twitter )
Nehal Wadhera: ఐపీఎల్-16లో ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ నెహల్ వధెరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెరైటీ శిక్ష వేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడేందుకు గాను ముంబై నుంచి లక్నోకు వెళ్లే క్రమంలో టీమ్ హోటల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ అతడు కాళ్లకు మ్యాచ్ ఆడేందుకు కట్టుకున్నట్టుగా ప్యాడ్స్ కట్టుకుని వచ్చాడు. ఇదేదో ఫ్యాషన్ అనుకుంటే పొరపాటే. వధెర ఆలస్యానికి ముంబై టీమ్ వేసిన శిక్ష..
ఏం జరిగిందంటే..
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడేందుకుగాను లక్నోకు పయనమయ్యేమేందు ముంబై టీమ్ బ్యాటర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు వధెర ఆలస్యంగా వచ్చాడట. దీంతో అతడు.. టీమ్ హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరేదాకా కాళ్లకు ప్యాడ్స్ కట్టుకోని రావాలని శిక్ష వేసిందట. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
#MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. He was captured with his pads on instead of traditional jumpsuit. According to our sources, #Nehal regrets being late for batters meeting. pic.twitter.com/vCzenvIWzC
— Mumbai Indians (@mipaltan) May 13, 2023
ఈ వీడియోపై పలువురు ఆకతాయి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇదేం వెరైటీ శిక్ష బాబోయ్..! బహుశా మరోసారి కూడా వధెర టీమ్ మీటింగ్ కు లేట్ గా వస్తే రోహిత్ శర్మను ఎత్తుకుని ఎయిర్ పోర్టు వరకు రమ్మంటారేమో..’అని కామెంట్ చేశాడు.
Also Read: సీజన్ మొత్తం మీద 2 మ్యాచులే ఆడిన స్టోక్స్
ఈ సీజన్ లో రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వధెరను కొనుగోలు చేసిన ముంబైకి అతడు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ తో అండగా నిలుస్తున్నాడు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ తో పాటు ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్ లలో ఏడు ఇన్నింగ్స్ లు ఆడి 198 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు 33 గా నమోదుకాగా స్ట్రైక్ రేట్ 151.55గా ఉంది. ఈ సీజన్ లో వధెర వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం సిక్సర్ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Also Read: గిల్ ఆన్ డ్యూటీ - లేనే లేదు పోటీ - ఫార్మాట్ ఏదైనా సెంచరీలు చేయడంలో మేటి
కాగా నేడు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. లక్నో వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే రోహిత్ సేన ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే మరో మ్యాచ్ ఫలితంతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే అది టాప్ -2కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైకి 15, ముంబైకి 14 పాయింట్లున్నాయి. ఇక లక్నో గెలిస్తే.. ముంబైని వెనక్కినెట్టి టాప్ -3కి వెళ్లడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్ ను మరింత ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ లక్నో ఓడితే మాత్రం ఆ జట్టుకు ఆర్సీబీ, రాజస్తాన్ తో నాలుగో స్థానానికి పోటీ తప్పకపోవచ్చు.
WTC Final 2023: పదేళ్లుగా ఐసీసీ టైటిల్ లేదు - ఆసీస్‌ను ఓడించి హిట్‌మ్యాన్ రికార్డు కొట్టేనా!!
WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్
Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు
Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్
Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్