అన్వేషించండి

Most Centuries in ODI: వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. ఎవరి ఖాతాలో ఎన్ని శతకాలు ఉన్నాయంటే

ODI Centuries Record | వన్డే ఫార్మాట్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తే సెంచరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే విరాట్ కోహ్లీ 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

ODI Centuries Record: వన్డే ఫార్మాట్ మొదలుపెట్టాక క్రికెట్ క్రేజ్ పెరిగింది. టీ20 ఫార్మాట్ వచ్చాక మ్యాచ్‌లు త్వరగా ముగియడంతో పాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతున్నాయి. కానీ వన్డే క్రికెట్ లో కాస్త నిలకడగా ఆడితేనే పరుగులు సాధ్యం. టీ20 తరహాలో బ్యాట్ ఊపితే కుదరదు. అయితే వన్డేలలో సెంచరీలు చేస్తే ఆటగాళ్లకు వచ్చే మజానే వేరు. జట్టు విజయం కోసం పరుగులు చేయడం ఒక ఎత్తు అయితే, సెంచరీ బాదితే ఆటగాళ్లకు సంతృప్తిగా ఉంటుంది. 

వన్డే ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత బ్యాటర్ వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 51 సెంచరీలు సాధించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. అతను సెంచరీ చేయడం మాత్రమే కాకుండా, ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.

విరాట్ కోహ్లీ (భారత్) – 51 సెంచరీలు

మ్యాచ్‌లు- 302

పరుగులు- 14,181

అత్యధిక వ్యక్తిగత స్కోరు- 183

విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేశాడు. 2008లో భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పటి పరుగుల దాహంతో రికార్డులు సృష్టించాడు. కీలక మ్యాచ్‌లలో, ముఖ్యంగా ఛేజింగ్ లో పరుగుల సునామీతో శతకాల శతకాల మీద చేసి నెంబర్ వన్ అయ్యాడు. అతని ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరిగెత్తే తీరు.. మ్యాచ్‌లను ముగించే ఇన్నింగ్స్‌లు కోహ్లీని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి.

సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 సెంచరీలు

మ్యాచ్‌లు- 463

పరుగులు- 18,426

అత్యధిక వ్యక్తిగత స్కోరు- 200 నాటౌట్

'క్రికెట్ దేవుడు' అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్ దాదాపు 2 దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌లో రారాజుగా నిలిచాడు. సచిన్ ఖాతాలో 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 200 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ సచిన్. ఆ తరువాతే పలువురు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు..

రోహిత్ శర్మ (భారత్) – 32 సెంచరీలు

మ్యాచ్‌లు- 273

పరుగులు- 11,168

అత్యుత్తమ స్కోరు- 264

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సాధించాడు. ‘హిట్‌మ్యాన్’గా పిలుచుకునే రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ వన్డేల్లో మొత్తం 32 సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కావడం విశేషం. 

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 30 సెంచరీలు

మ్యాచ్‌లు- 375

పరుగులు- 13,704

అత్యుత్తమ స్కోరు- 164

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఆసీస్ ను చాలాకాలం పాటు నెంబర్ వన్‌గా నిలిపాడు. కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాట్ తోనూ రికార్డులు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుకు రెండు ప్రపంచ కప్‌లను అందించిన కెప్టెన్ పాంటింగ్. తన వన్డే కెరీర్‌లో 30 సెంచరీలు ఉన్నాయి. పాంటింగ్ తన కాలంలో గొప్ప బ్యాటర్, కెప్టెన్‌గానూ నిలిచాడు.

సనత్ జయసూర్య (శ్రీలంక) – 28 సెంచరీలు

మ్యాచ్‌లు- 445

పరుగులు- 13,430

అత్యధిక వ్యక్తిగత స్కోరు- 189

శ్రీలంకకు చెందిన మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య దూకుడు బ్యాటింగ్ తో పవర్‌ప్లే అర్థాన్ని మార్చేశాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్, ఓపెనర్ బ్యాటర్‌గా జయసూర్య రాణించాడు. తన కెరీర్‌లో జయసూర్య 28 సెంచరీలు చేశాడు. అతడు బంతితోనూ అద్భుతం చేశాడు. పలు మ్యాచ్ లలో తన బౌలింగ్ నైపుణ్యంతో జట్టుకు విజయాలు అందించాడు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Lionel Messi Statue :మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
Dog Astrology: ఇంట్లో ఏ రంగు కుక్కను పెంచుకోవాలి? నలుపు రంగు కుక్కను పెంచుకోవచ్చా?
ఇంట్లో ఏ రంగు కుక్కను పెంచుకోవాలి? నలుపు రంగు కుక్కను పెంచుకోవచ్చా?
Embed widget