Virat kohli: నువ్వో పెద్ద తోపువి మరి! నిన్ను పట్టించుకునేదెవరు? - ఆకాశ్ చోప్రాపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా మాజీ సారథి కోహ్లీపై ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Virat kohli: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా మారిన ఆకాశ్ చోప్రాపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మూడు రోజుల క్రితం చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా.. కోహ్లీ ఇక టెస్టులలో ఎంతమాత్రమూ ప్రమాదకర ఆటగాడు కాదని, అతడిని ఫ్యాబ్ - 4 నుంచి తప్పించాలని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ కోహ్లీ అభిమానులను ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో చోప్రాను కోహ్లీ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు. ‘అసలు నీ గురించి పట్టించుకునేదెవడు..?, నువ్వు చెప్పింది వినేదెవడు..?’ అంటూ ఫైర్ అవుతున్నారు.
చోప్రా ఏం చెప్పాడు..?
కోహ్లీ ఇటీవల కాలంలో టెస్టులలో వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో మూడు రోజుల క్రితం యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘ఫ్యాబ్ 4 ఇక ఎంతమాత్రమూ ఉనికిలో లేదు. దాని నుంచి కోహ్లీ తప్పుకున్నట్టే. ఇక దానిని ఫ్యాబ్ 3 అని పిలుచుకోవడమే బెటర్. కోహ్లీకి బదులు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ఈ లిస్ట్‌లో చేర్చాలి. కానీ ఇప్పుడే కాదు. దానికింకా టైమ్ ఉంది. ఇప్పటికైతే ఫ్యాబ్ -3 మాత్రమే ఉంది..’ అని కామెంట్స్ చేశాడు.
Latest Entry in Fab 4
— Pankaj Msdian (@HonestMSDian) July 9, 2023
Aakash Chopra replaces Virat Kohli https://t.co/4nUeVGsw9d pic.twitter.com/1drHLlM3nB
మరో నెటిజన్.. ‘ఆకాశ్.. ఫ్యాబ్ -4 అనేది ర్యాంకింగ్ కాదు. అది మారుతూ ఉండటం, మోడీఫైడ్ చేయడం ఉండదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ‘అసలు నువ్వు చెప్పేది వినేది ఎవడు..? నిన్ను పట్టించుకునేది ఎవడు..? నీ అభిప్రాయం ఎవడికి కావాలి..?’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.
New Fab four according to best commentator :
— Who cares? (@Retired__hurt) July 10, 2023
Steve smith
joe root
kane williamson
Aakash chopra replacing virat kohli#GOAT𓃵 pic.twitter.com/yeijKXZKzO
ఆకాశ్ చేసిన ఈ వ్యాఖ్యలు కోహ్లీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయి. గతంలో చోప్రా ఇండియాతో పాటు ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌ల తాలూకూ గణాంకాలను షేర్ చేస్తూ.. ‘ఇదిగో.. మనకు కొత్త ఫ్యాబ్ - 4 ప్లేయర్ దొరికాడు...’అని ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్.. కోహ్లీ ముఖం స్థానంలో చోప్రా ఫోటోను మార్ఫింగ్ చేసి.. ‘బెస్ట్ కామెంటేటర్ అభిప్రాయం ప్రకారం కొత్త ఫ్యాబ్ - 4 జాబితా ఇది : స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్, ఆకాశ్ చోప్రా’ అని మీమ్ షేర్ చేశాడు.
Aakash Chopra perhaps belongs to worst 4 himself as a player 🤣🤣🤣🤣
— Mahmood iqbal (@moodziqbal) July 10, 2023
ఆకాశ్ తన వీడియోలోనే కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘టెస్టులలో కోహ్లీ గణాంకాల గురించి మనం మాట్లాడుకుంటే .. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అతడు పీక్స్ చూశాడు. ఆ ఐదేండ్ల కాలంలో కోహ్లీ.. 62 టెస్టులలో 58.71 సగటుతో ఏకంగా 5,695 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు కూడా ఉన్నాయి. అప్పుడు కోహ్లీ అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు చేసి సంచలనాలు సృష్టించాడు. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు. 2020 తర్వాత టెస్టులలో కోహ్లీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. ఈ ఫార్మాట్‌లో అతడు ఇంకెంతమాత్రమూ ప్రమాదకర బ్యాటర్ అయితే కాదు..’ అని వ్యాఖ్యానించాడు.
Why does Aakash Chopra's opinion even matter!?
— Ankit Chandak (@ankitochands) July 10, 2023
Stop listening to Aakash Chopra!
— Dharmil Shah (@DharmilShah22) July 10, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial