అన్వేషించండి

Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..

కపిల్ దేవ్ తనపై యోగ్‌రాజ్ సింగ్ చేసిన గన్ థ్రెట్ కామెంట్స్ పై స్పందిస్తూ కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంటానని చెప్పాడు.

Kapil Dev Responds To Yograj Singh: ఇండియా గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ చిన్ననాటి స్నేహితులు. ఒకే కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఈ ఇద్దరూ ఇండియా టీమ్ కు ఆడారు. అయితే కపిల్ వరల్డ్ క్లాస్ లెజెండ్ అవ్వగా, యోగ్‌రాజ్ కెరీర్ కేవలం ఒక టెస్ట్, ఆరు వన్డేలకే పరిమితమైంది. తన కెరీర్ నాశనం అవ్వడానికి కపిల్ దేవే రీజన్ అంటూ యోగ్‌రాజ్ సింగ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. కపిల్ కెప్టెన్ అయ్యాక తనను కావాలనే టీమ్ నుంచి తీసేశాడని ఆరోపించాడు. ఆ కోపంతో తాను పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డానని చెప్పడం క్రికెట్ హిస్టరీలో పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మ్యాటర్ పై కపిల్ దేవ్ ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యాడు.

Read Also: ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్

పిస్టల్ తో ఇంటికి వెళ్లా.. యోగ్‌రాజ్ పాత కామెంట్స్ వైరల్
గతంలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన భార్య ఫోర్స్ చేయడం వల్ల తాను కపిల్ ను నిలదీయడానికి డిసైడ్ అయ్యానని అన్నాడు. "వాడికి బుద్ధి చెప్తానని నా పిస్టల్ తీసుకుని సెక్టార్ 9 లోని కపిల్ ఇంటికి వెళ్లా. అతను తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. నేను అతన్ని దారుణంగా తిట్టా. నీ వల్లే నా ఫ్రెండ్ ను కోల్పోయా, నువ్వు చేసిన తప్పుకు అనుభవిస్తావ్ అని వార్నింగ్ ఇచ్చా" అని యోగ్‌రాజ్ ఓపెన్ గా చెప్పాడు. ఈ క్రేజీ ఇన్సిడెంట్ తర్వాత యోగ్‌రాజ్ కొడుకు, ఇండియా వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో కపిల్ దేవ్‌కు పర్సనల్ గా క్షమాపణలు కూడా చెప్పాడు.

Read Also: Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!

యువి క్షమాపణలు అవసరం లేదు.. 
ఈ వివాదంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. యువరాజ్ తనకు సారీ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదని అన్నాడు. "యువరాజ్ గ్రేట్ క్రికెటర్, ఇండియాకు అతను చేసిన సేవలు అద్భుతం. క్రికెట్ ను అతను మరింత పాపులర్ చేశాడు, ఫ్యాన్స్ అతన్ని ఫుల్ గా లవ్ చేస్తారు" అని కపిల్ ప్రశంసించాడు. ఇక యోగ్‌రాజ్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ.. "అతనేం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థ: కావడం లేదు. నా వైపు నుంచి ఇప్పటికీ స్నేహమే ఉంది. కాకపోతే నా లైఫ్ లో ఎప్పుడూ  నెగెటివ్ గా, అశాంతితో ఉండే వ్యక్తులను కలవడానికి నేను ఇష్టపడను. ఎప్పుడూ హ్యాపీగా ఉండే వాళ్లనే కలుస్తా" అని కపిల్ క్లియర్ గా చెప్పాడు.

జీవితంలో ముందుకు సాగాలి.. పాత జ్ఞాపకాలే ముఖ్యం
మనుషులు నెగెటివిటీతో ఉంటే సమాజం వారిని ప్రేమించదని కపిల్ అన్నాడు. "యోగ్‌రాజ్ కొడుకు యువరాజ్ అంత ఎత్తుకు ఎదిగాడు, అతను లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. అందరికీ అన్నీ దొరకవు, కొన్నిసార్లు మనకు దొరుకుతాయి, కొన్నిసార్లు ఫ్యామిలీకి వస్తాయి. రోజు చివర్లో మనం సంతోషంగా ఉండటం ముఖ్యం. ఒకరిని కొట్టడం వల్ల, తిట్టడం వల్ల ఏం వస్తుంది? జీవితంలో ముందుకు సాగిపోవాలి. యోగ్‌రాజ్ లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు, ఇండియాకు ఆడాడు, సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చాలా మంది కంటే అతనికి ఎక్కువే దొరికింది, అయినా హ్యాపీగా లేకపోతే ఎవరూ ఏం చేయలేరు" అని కపిల్ అన్నాడు. చిన్ననాటి స్నేహితుడితో గడిపిన మంచి రోజులు మాత్రమే గుర్తుంచుకుంటానని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget