Kane Williamson: టీ 20 వరల్డ్‌కప్ ఎఫెక్ట్- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్
Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ , స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.
![Kane Williamson: టీ 20 వరల్డ్‌కప్ ఎఫెక్ట్- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్ Kane Williamson quits as New Zealand captain declines central contract after T20 World Cup debacle Kane Williamson: టీ 20 వరల్డ్‌కప్ ఎఫెక్ట్- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/7b79b5199549eef17b3b0b9e0a62953217187704845071036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kane Williamson Leave New Zealand Captaincy: ప్రపంచకప్ క్రికెట్‌లో అద్భుత కెప్టెన్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన న్యూజిలాండ్(New Zealand) కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson )సంచలన ప్రకటన చేశాడు. తన కెప్టెన్సీతో కివీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విలియమ్సన్.... న్యూజిలాండ్‌కు ఐసీసీ టోర్నీలో అద్భుత విజయాలు అందించాడు. విలియమ్సన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించిడంతో అతడి భవిష్యత్తుపైనా సందేహాలు నెలకొన్నాయి. 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన ప్రతిపాదనను కేన్ తిరస్కరించాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే విలియమ్సన్ కెప్టెన్‌గా వైదొలిగినా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. T20 ప్రపంచకప్(T20 World Cup)లో లీగ్ దశలోనే కివీస్ వెనుదిరగడంతో కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఓడిపోయిన తర్వాత కివీస్ గ్రూప్ దశల్లోనే నిష్క్రమించింది. కేన్ విలియమ్సన్ 2024-25 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించినా మూడు ఫార్మాట్‌లలో కివీస్‌కు ఆడతానని ప్రకటించాడని కివీస్ బోర్డు వెల్లడించింది.
Contract News | Kane Williamson has re-emphasised his long-term commitment to the BLACKCAPS in all three formats - despite declining a central contract for the 2024-25 year. #CricketNation https://t.co/FhDIgpoifs
— BLACKCAPS (@BLACKCAPS) June 18, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)