News
News
X

Jasprit Bumrah: ఆ వార్త తెలిసి గుండె పగిలిందన్న జస్ప్రీత్‌ బుమ్రా!

Bumrah On T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమైనందుకు బాధగా ఉందని టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అన్నాడు.

FOLLOW US: 
 
Bumrah On T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమైనందుకు బాధగా ఉందని టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. జట్టుకు దూరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో హిట్‌మ్యాన్‌ సేన విజయ యాత్రను ఎంజాయ్‌ చేస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ ముందు జస్ప్రీత్‌ బుమ్రా దూరమవ్వడం టీమిండియాకు భారీ షాక్! భారత పేస్ దళంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది అతడే కావడం గమనార్హం. అత్యంత వేగంగా, చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయడం అతడి ప్రత్యేకత. ఓవర్‌లో చురకత్తుల్లాంటి యార్కర్లు సంధించి వికెట్లు పడగొడతాడు. ఆస్ట్రేలియా సిరీసు తర్వాత అతడు గాయపడ్డాడు. కొన్నాళ్లు అతడి గాయం తీవ్రతను పర్యవేక్షించిన బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడని ప్రకటించింది. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి బుమ్రాకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని సమాచారం.

'టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యానని తెలిసి బాధపడుతున్నా. ఏదేమైనా నేను ప్రేమించేవారి నుంచి సపోర్ట్‌, కేర్‌, విషెష్‌ దొరికినందుకు కృతజ్ఞతలు. నేను రికవరీ అవుతూనే మరోవైపు ఆసీస్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్రను ఆనందిస్తాను' అని బుమ్రా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.

News Reels

వెన్ను గాయం కారణంగా బుమ్రా 2022లోనే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపినా ప్రయోజనం లేకపోయింది. బుమ్రా ఆడబోవడం లేదని గత 10 రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఈ గాయం కారణంగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచి కూడా బుమ్రాను పక్కన పెట్టారు.

భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడంతో బౌలింగ్ లైనప్ విషయంలో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయని అని చెప్పవచ్చు. వీరి గైర్హాజరు టోర్నమెంట్ విజయావకాశాలపైనే ప్రభావం చూపించనుంది.

Published at : 04 Oct 2022 12:07 PM (IST) Tags: BCCI Jasprit Bumrah T20 World Cup icc t20 worldcup 2022

సంబంధిత కథనాలు

IPL 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!

IPL 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!

Ricky Ponting Health Issue: కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్‌కు హెల్త్‌ ఇష్యూ! హుటాహుటిన ఆస్పత్రికి పరుగు!

Ricky Ponting Health Issue: కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్‌కు హెల్త్‌ ఇష్యూ! హుటాహుటిన ఆస్పత్రికి పరుగు!

Most T20I Runs in 2022: ట్వంటీ22 మొనగాడు మిస్టర్‌ 360! రన్స్‌ ఫెస్ట్‌లో సూర్య తర్వాతే రిజ్వాన్‌, కోహ్లీ!

Most T20I Runs in 2022: ట్వంటీ22 మొనగాడు మిస్టర్‌ 360! రన్స్‌ ఫెస్ట్‌లో సూర్య తర్వాతే రిజ్వాన్‌, కోహ్లీ!

PAK vs ENG 1st Test: టెస్టు తొలిరోజే ఇంగ్లాండ్‌ 506 రన్స్‌ - 112 ఏళ్ల రికార్డు బద్దలు, నలుగురి సెంచరీలు

PAK vs ENG 1st Test: టెస్టు తొలిరోజే ఇంగ్లాండ్‌ 506 రన్స్‌ - 112 ఏళ్ల రికార్డు బద్దలు, నలుగురి సెంచరీలు

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !