అన్వేషించండి
Advertisement
Ajay Jadeja: హార్దిక్ పాండ్యాపై అజయ్ జడేజా వ్యంగాస్త్రాలు , అదే ట్యాలెంట్ అంటూ విమర్శలు
Hardik Pandya: టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు , ప్రపంచకప్‌లో అప్గానిస్తాన్ మెంటార్‌గా పనిచేసిన అజయ్ జడేజా హార్దిక్ పాండ్యాను తీవ్రంగా విమర్శించాడు.
Ajay Jadeja Comments On Hardik Pandya: చీలమండ గాయంతో ప్రపంచకప్ నుంచి దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు పాండ్యా నాయకత్వం వహించే అవకాశం ఉంది. బ్యాటుతోనూ బంతితోనూ రాణించే సత్తా ఉన్న హార్దిక్ పాండ్యా ఇటీవల కీలక మ్యాచులకు దూరవవుతున్నాడు. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, ప్రపంచకప్‌లో అప్గానిస్తాన్ మెంటార్‌గా పనిచేసిన అజయ్ జడేజా తీవ్రంగా విమర్శించాడు. హార్దిక్ పాండ్యాకు ఓ అరుదైన టాలెంట్ ఉందని... అదేంటంటే అతడు గ్రౌండ్‌లో చాలా అరుదుగా కనిపిస్తాడని జడేజా ఎద్దేవా చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌కు ఇప్పటికే దూరమైన పాండ్యా మరో సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా.. జనవరిలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే సిరీస్ నాటికైనా అందుబాటులో ఉంటాడా లేడా అనేది తేలాల్సి ఉంది.
ఇటీవలే టీమిండియా సెలక్షన్ విధానంపైనా అజయ్ జడేజా విమర్శలు గుప్పించాడు. ఇదేం విధానమంటూ మండిపడ్డాడు. ఇండియన్ క్రికెట్‌లో ఇది కొత్త కాదని, సెలక్ట్ చేయడం కాదు రిజెక్ట్ చేస్తారని తీవ్ర విమర్శలు గుప్పించాడు. భారత జట్టులోకి ఆటగాళ్ల ఎంపికపై కన్నా ఎవరిని తొలగించాలనే విషయంపైనే బీసీసీఐ పెద్దలు దృష్టి పెడతారంటూ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా బీసీసీఐ తీరు ఇలాగే ఉందని విమర్శించాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషాన్‌ను పక్కన పెట్టడాన్ని తప్పుబడుతూ జడేజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో ఇషాన్ కిషన్ కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి మూడు మ్యాచుల్లో ఆడిన ఇషాన్ కిషన్‌కు చివరి రెండింట్లో విశ్రాంతినిచ్చారు. ఈ తీరును అజయ్ జడేజా తప్పుపట్టాడు. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన ఆటగాడిని ఎలా పక్కన పెడతారంటూ నిలదీశాడు.
ఇషాన్ కిషన్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టడంపై అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్‌కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు. ఇషాన్ కిషన్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజున అతడు జట్టును భుజాన మోస్తాడని జడేజా చెప్పాడు. ఇషాన్ కిషన్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడని... అయినా అతడికి అవకాశాలు తక్కువగానే వస్తున్నాయని జడేజా అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడని.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనైనా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించాల్సిందని తెలిపాడు. మూడు మ్యాచ్‌ల తర్వాత విశ్రాంతి అంటూ ఇషాన్‌ను ఇంటికి పంపించారని.. ఇలాగే కొనసాగితే ఇషాన్ కిషన్ ఎప్పుడు పరిపూర్ణ క్రికెటర్‌గా మారతాడని అజయ్ జడేజా ప్రశ్నల వర్షం కురిపించాడు. తనదైన రోజున మ్యాచ్ గమనాన్నే కిషన్ మార్చేయగలడని.. అలాంటి ఆటగాడిని కూడా తరచూ పక్కన పెట్టడం సరైంది కాదని తేల్చి చెప్పాడు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలను కల్పించి జట్టులో కుదురుకునేందుకు సమయం ఇవ్వాలని సూచించాడు. అయితే, బీసీసీఐ తీరు మాత్రం ప్లేయర్ల సెలక్షన్‌పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలన్న విషయంపైనే ఉంటుందని జడేజా మండిపడ్డారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion