By: ABP Desam | Updated at : 02 Dec 2022 04:43 PM (IST)
Edited By: nagavarapu
డ్వేన్ బ్రావో, స్మిత్ (source: twitter)
IPL 2023: ఐపీఎల్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్లు లిస్టును బీసీసీఐకు అందజేశాయి. విడుదల చేసిన ఆటగాళ్లు తమ పేర్లును వేలంలో నమోదు చేసుకున్నారు. అయితే కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు ఇంకా తమ పేర్లను వేలంలోకి ఇవ్వలేదు. దీన్ని బట్టి వారు వచ్చే ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.
ఐపీఎల్ కు బ్రావో దూరం
వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన పేరును వేలంలోకి ఇవ్వలేదు. ఏళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈసారి అతన్ని చెన్నై అట్టిపెట్టుకోలేదు. రిలీజ్ చేసింది. సీఎస్ కే తనను విడుదల చేశాక బ్రావో తన పేరును వేలానికి ఇవ్వలేదు. దీన్ని బట్టి అతను ఐపీఎల్ నుంచి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ఇకమీదట భారత టీ20 లీగ్ లో బ్రావో మెరుపులు కనిపించవేమో.
Thank you, DJ Bravo for all the memories, an incredible IPL career, leading wicket taker in the history of the league, value contribution always with the bat.
All the best for the second innings as the bowling coach. pic.twitter.com/BPOc16gIAM — Johns. (@CricCrazyJohns) December 2, 2022
స్మిత్, లబుషేన్ కూడా
ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్ కూడా తమ పేర్లను ఐపీఎల్ వేలానికి ఇవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫాంలో ఉన్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో స్మిత్, లబుషేన్ లు డబుల్ సెంచరీలతో చెలరేగారు. రాబోయే యాషెస్ సిరీస్ కు తయారయ్యేందుకు వీరు ఐపీఎల్ 2023 వేలానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఆటగాళ్లు 2021 ఐపీఎల్ లో సీజన్ లో అమ్ముడుపోలేదు. అప్పుడు వీరిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.
ఐపీఎల్ మినీ వేలం తేదీ మార్చాలన్న ఫ్రాంచైజీలు- తిరస్కరించిన బీసీసీఐ!
ఐపీఎల్ 2023 ఎడిషన్ కోసం డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ తేదీని మార్చాలని కొన్ని ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. అయినా కూడా వేలం తేదీలను బోర్డు మార్చబోవడం లేదని వార్తలు వస్తున్నాయి.
దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని వేలం తేదీని మార్చమని అడిగారు. వారి అభ్యర్థనను మేం అర్ధం చేసుకోగలం. అయితే తేదీని మార్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో సమీకరణాలు ఉన్నాయి. తేదీని మార్చితే ప్రతిదాన్ని మార్చాలి. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మినీ వేలం ఆ సమయానికే జరుగుతుంది. అని ఆయన చెప్పినట్లు సమాచారం.
పంజాబ్ వద్ద ఎక్కువ డబ్బు
2022లో జరిగిన మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ. 3.45 కోట్ల డబ్బు మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 1.55 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ రూ. 95 లక్షలు, కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 45 లక్షలు, గుజరాత్ టైటాన్స్ రూ. 15 లక్షలతో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ వద్ద తలా రూ. 10 లక్షలు మిగిలాయి. లక్నో సూపర్ జెయింట్స్ పర్సు మొత్త ఖాళీ అయిపోయింది.
Women's T20 World Cup 2023 Schedule: ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 12న చిరకాల ప్రత్యర్థితో భారత్ ఢీ
Hardik Pandya: నిర్ణయాలు నావే, ఫలితానికి బాధ్యతా నాదే: హార్దిక్ పాండ్య
WPL Auction 2023: ఫిబ్రవరి 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం!
IND vs NZ 3rd T20: శుభ్మన్ గిల్ సెంచరీ నుంచి న్యూజిలాండ్ పతనం వరకు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మీమర్స్!
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్మన్ గిల్ - అరుదైన రికార్డు!
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?