By: ABP Desam | Updated at : 13 Apr 2023 11:01 PM (IST)
మహేంద్ర సింగ్ ధోని (ఫైల్ ఫొటో) (Image Credit: IPL Twitter)
MS Dhoni in IPL: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అతని బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురుస్తుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌ని ప్రదర్శించాడు. అతను 17 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాటు ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో 100 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు టోర్నీ 20వ ఓవర్లో బ్యాటింగ్ విషయంలో ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
20వ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ధోని
ఐపీఎల్‌లో 20వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీనే. టోర్నీలో ఇప్పటి వరకు, 20వ ఓవర్లో అతని బ్యాట్ నుండి మొత్తం 57 సిక్సర్లు వచ్చాయి. ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ 33 సిక్సర్లతో రెండో స్థానంలో, రవీంద్ర జడేజా 26 సిక్సర్లతో మూడో స్థానంలో, హార్దిక్ పాండ్యా 25 సిక్సర్లతో నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ 23 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
2023లో ధోనీ బ్యాట్ భీకరంగా
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు ధోని బ్యాట్ బాగా పేలింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 214.81 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు సార్లు అజేయంగా తిరిగాడు. 41 ఏళ్ల ధోని ఇప్పటివరకు మొత్తం 27 బంతులు ఆడాడు. అందులో అతను రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ ఒక్కసారి మాత్రమే ఔటయ్యాడు.
ఇప్పటి వరకు ధోని ఐపీఎల్ కెరీర్ ఇలా
మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 238 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 209 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 39.34 సగటు, 135.78 స్ట్రైక్ రేట్‌తో 5036 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతని బ్యాట్ నుంచి మొత్తం 24 హాఫ్ సెంచరీలు వచ్చాయి. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 84 పరుగులు. ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 348 ఫోర్లు, 235 సిక్సర్లు బాదాడు.
తమిళనాడులోని చెన్నైలో ఉన్న చెపాక్ మైదానంలో సంజూ సేన అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 పరుగుల తేడాతో అమేజింగ్ విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ చేశాడు. ఎంఎస్ ధోనీ (32*; 17 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్ సెంచరీ కొట్టాడు. దేవదత్ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్ అశ్విన్ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మైయిర్ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) కూడా మెరుపు బ్యాటింగ్ చేయడం విశేషం.
IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు
WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్
Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్
IND vs AUS, WTC Final 2023: వార్నర్ ఔట్ - పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
WTC Final 2023: ప్చ్.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్! అజింక్య సెంచరీ మిస్ - ఆసీస్‌కు భారీ లీడ్!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !
Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!