అన్వేషించండి

DC vs GT: సాయి క్లాస్ ఇన్నింగ్స్.. ఆఖర్లో కిల్లర్ మిల్లర్ మెరుపులు- గుజరాత్‌కు రెండో విజయం

IPL 2023: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్.. ఐపీఎల్ - 16 లో రెండో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డలోనూ ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

DC vs GT 2nd Innings Highlights: ఐపీఎల్ - 16లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన  గుజరాత్ జెయింట్స్   సీజన్‌లో  పేరుకు తగ్గట్టే ఛాంపియన్‌లా దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో  చెన్నైని ఓడించిన   పాండ్యా సేన.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీకి కూడా ఓటమి రుచి చూపించింది.  ఢిల్లీ  తమ ముందు నిలిపిన  163 పరుగుల లక్ష్యాన్ని మరో  11 బంతులు మిగిలుండగానే  4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  ఓపెనర్లు విఫలమైనా  సాయి సుదర్శన్  (48 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడకు తోడు  ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (16 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో  ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకుంది.   గుజరాత్ బ్యాటర్లను  తొలుత కాస్త ఇబ్బందిపెట్టిన  ఢిల్లీ బౌలర్లు  తర్వాత తేలిపోయారు.  ఫలితంగా ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత సొంతగడ్డపై ఓడిపోయిన రెండో జట్టుగా నిలిచారు. 

ఢిల్లీ నిర్దేశించిన   మోస్తారు లక్ష్య ఛేదనలో  గుజరాత్ ఇన్నింగ్స్ ధాటింగా ఆరంభమైంది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (7 బంతుల్లో  14, 2 ఫోర్లు, 1 సిక్సర్).. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో   రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 14 పరుగులు రాబట్టాడు. ముఖేశ్ కుమార్ వేసిన  రెండో ఓవర్లో గిల్  (13 బంతుల్లో 14, 3 ఫోర్లు)   కూడా రెండు బౌండరీలు సాధించాడు.  

బ్రేక్ ఇచ్చిన  నోర్జే.. 

ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్‌కు ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే  తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో  తొలి బంతికే  సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  తన తర్వాతి ఓవర్లో.. గిల్ ను కూడా  సీమ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని  అంచనా వేయడంలో గురి తప్పిన గిల్.. వికెట్‌ను పారేసుకున్నాడు. గిల్ స్థానంలో వచ్చిన  గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా (4)ను  ఖలీల్ అహ్మద్  ఔట్ చేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో గుజరాత్  కష్టాల్లో పడింది.  

ఆదుకున్న సాయి సుదర్శన్.. 

వన్ డౌన్‌లో వచ్చిన  సుదర్శన్.. నోర్జే వేసిన  ఐదో ఓవర్లో ఓ భారీ సిక్సర్ బాదాడు. తర్వాత ఖలీల్  వేసిన ఆరో ఓవర్లో  బౌండరీ బాదినా  వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో  పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు.  పాండ్యా నిష్క్రమించిన తర్వాత  జోషువా లిటిల్ స్థానంలో  ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన విజయ్ శంకర్ (23 బంతుల్లో  29, 3 ఫోర్లు)  సాయంతో గుజరాత్‌ను నడిపించాడు. తొలి పవర్ ప్లే తర్వాత  గుజరాత్ స్కోరు వేగం కూడా తగ్గింది. శంకర్  - సుదర్శన్ లు  ధాటిగా ఆడకున్నా  వికెట్ కోల్పోకుండా నిలబడ్డారు.  వీరిద్దరూ మరీ నెమ్మదిగా ఆడటంతో 6 ఓవర్లలోనే 50కి చేరిన గుజరాత్ స్కోరు.. 13 ఓవర్ లో వందకు చేరింది. అయితే క్రీజులో కుదురకున్న  శంకర్‌ను  మిచెల్ మార్ష్..   14వ ఓవర్లో రెండో బంతికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 

కిల్లర్ మిల్లర్ షో.. 

గుజరాత్  సాధించే లక్ష్యం తాలూకూ    రిక్వైర్డ్  రన్ రేట్  పెరుగుతుండటంతో క్రీజులోకి వచ్చిన  డేవిడ్ మిల్లర్.. వస్తూనే  బాదడం స్టార్ట్ చేశాడు. ముఖేశ్ కుమార్ వేసిన  16వ ఓవర్లో   6, 6, 4 సాధించాడు.  ఈ ఓవర్లో గుజరాత్‌కు 20 పరుగులొచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో   మూడో బంతికి  బౌండరీ సాధించడం ద్వారా సాయి  హాఫ్ సెంచరీ (44 బంతుల్లో) పూర్తైంది.  నోర్జే వేసిన అదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాదడం ద్వారా గుజరాత్  స్కోరు 150 దాటింది.   ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో పది పరుగులొచ్చాయి.   మార్ష్ వేసిన  19వ ఓవర్లో   రెండు పరుగులు తీసిన మిల్లర్ గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..  నిర్ణీత  20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి  162 పరుగులు చేసింది.  ఆ జట్టులో  కెప్టెన్ డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37, 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30, 2 ఫోర్లు) లు రాణించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Fatal Accident In Jaipur: జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Embed widget