By: ABP Desam | Updated at : 13 May 2023 10:51 AM (IST)
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Image Source : Delhi Capitals Twitter )
DC vs PBKS Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16వ సీజన్ లో పాయింట్ట పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ వస్తున్న పంజాబ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ఇంకా ఛాన్స్ అయితే ఉంది. నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ తో పాటు తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్టు టాప్ - 4లో ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్.. నేటి రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది.
ఢిల్లీకి పోయేదేమీ లేదు..
ఈ సీజన్ ను ఐదు వరుస పరాజయాలతో ప్రారంభించి ఇటీవలే చెన్నైతో మ్యాచ్ లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇకనుంచి ఫ్రీ బర్డ్. నేడు పంజాబ్ తో పాటు తర్వాత ఆడబోయే మరో రెండు మ్యాచ్ లలో గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఫరక్ పడదు. సీజన్ ఆరంభం నుంచి పేలవ బ్యాటింగ్ తో కొట్టుమిట్టాడున్న ఢిల్లీకి ఆఖరి మ్యాచ్ లలో అయినా కుదురుకుంటే అది ఆ జట్టు అభిమానులకు కాస్త ఊరటనిచ్చినట్టే.
పంజాబ్‌కు గెలిస్తేనే..
ఐపీఎల్-16 లో 11 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు తమ ఖాతాలో 10 పాయింట్లున్నాయి. ఇంకా ఆ జట్టు ఢిల్లీతో మ్యాచ్ కాక మరో రెండు గేమ్స్ ఆడనుంది. మూడింట గెలిస్తే ఆ జట్టుకు 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ, లక్నోతో పాటు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండే జట్టుతో పోటీ పడొచ్చు. అయితే ఇది ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
పంజాబ్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ రాణిస్తున్న మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ రెండు మూడు మ్యాచ్ లలో ధాటిగా ఆడి తర్వాత విఫలమయ్యాడు. గత మ్యాచ్ లో భానుక రాజపక్స తిరిగొచ్చినా నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ లు నిలకడగా ఆడుతుండటం పంజాబ్‌కు కలిసొచ్చేదే. సామ్ కరన్ కూడా ఓ చేయి వేస్తే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో అర్ష్‌దీప్ పవర్ ప్లే లో రాణిస్తున్నా డెత్ ఓవర్లలో విఫలమవుతున్నాడు. ఇది పంజాబ్‌కు ఆందోళన కలిగించేదే..
All smiles before the much awaited ℕ𝕠𝕣𝕥𝕙𝕖𝕣𝕟 𝔻𝕖𝕣𝕓𝕪 ♥️💙#YehHaiNayiDilli #IPL2023 #DCvPBKS pic.twitter.com/mFrjQIwBlV
— Delhi Capitals (@DelhiCapitals) May 12, 2023
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరణ్, రిషి ధావన్, నాథన్ ఎల్లిస్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, హర్‌ప్రీత్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రాఠీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కగిసొ రబడ, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, శివమ్ సింగ్, మాథ్యూ షార్ట్, సికందర్ రజా, అథర్వ తైడే, బల్తేజ్ సింగ్, రాహుల్ చాహర్, విద్యుత్ కావరప్ప
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, ప్రియమ్ గార్గ్, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్, రిలీ రూసో
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!