Women's Odi World Cup IND VS Pak Latest Updates: పాక్ మహిళా జట్టుతో కూడా నో హ్యాండ్ షేక్.. బీసీసీఐ తాజా నిర్ణయం..! కొలంబోలో ఆదివారం మ్యాచ్
పాక్ విషయంలో తమ ధోరణిలో మార్పు లేదని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. ఆ జట్టు ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసేది లేదని తేల్చింది. దాయాదులు కొలంబోలో వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆడనున్నాయి.

Ind Vs Pak Women's Match Latest News: ఇండియా, పాకిస్తాన్ జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకున్నారు. దీనిపై ఐసీసీ వరకు ఫిర్యాదులు వెళ్లగా పాక్ నుంచి హరీస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఇండియా నుంచి టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లకు అక్షింతలు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య మరో క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. అయితే ఈసారి పురుషుల విభాగంలో కాకుండా, మహిళా జట్లు కలిసి తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం కొలంబోలో ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఎలా ప్రవర్తించాలో ఆటగాళ్లకు బీసీసీఐ క్లియర్ కట్ గా సూచనలు చేసింది.
IND W vs PAK W: After Asia Cup, BCCI Instructs Indian Women's Cricketers Not To Shake Hands With Their Pakistani Counterparts In Women's World Cup 2025, Says Report#AsiaCup #INDWvsPAKW #WomensWorldCup #WomensWorldCup2025 #BCCIhttps://t.co/KvALiyRIVZ
— Free Press Journal (@fpjindia) October 1, 2025
నో హ్యాండ్ షేక్..
ఇక ఆసియాకప్ లో మూడు మ్యాచ్ ల్లో దాయాదులు ఇండియా, పాక్ లు ఆడగా, మ్యాచ్ ముగిశాక పాక్ ఆటగాళ్లకు టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ, ఉపయోగం లేకుండా పోయింది. ఆటగాళ్లకు కచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఏదీ క్రికెట్ ప్రవర్తన నియమావళిలోలేదు. దీంతో పాక్ ఆటగాళ్లతో కరాచలనం చేసేందుకు ఇండియన్ ప్లేయర్లు నిరాకరించారు. క్రీడా ప్రవర్తన నియామావళిని ఉల్లంఘిస్తే తప్ప, ఐసీసీ ఇందులో జోక్యం చేసుకోదు. ఈక్రమంలో పాక్ మహిళా ఆటగాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బోర్డు తాజాగా సూచించింది.
కొలంబోలో ఎందుకంటే..
నిజానికి ఈసారి వన్డే ప్రపంచకప్ ను భారత్ నిర్వహిస్తోంది. అయితే భద్రతా కారణాలతో పాక్, ఇండియాలో ఆడటం లేదు. కొలంబోలోనే మొత్తం మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో ఇండియా అక్కడికి వెళ్లి, తమ మ్యాచ్ లను ఆడనుంది. గత చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ ఒడంబడిక జరిగింది. ఇది 2027 వరకు అమలులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరుదేశాలలో ఐసీసీ, ఏసీసీ టోర్నీలు జరిగినట్లయితే తటస్త వేదికలలోనే ఇరుదేశ జట్లు తలపడనున్నాయి. ఇక కొలంబోలో అదివారం దాయాదుల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. లంకపై గెలిచి ఇప్పటికే భారత్ శుభారంభం చేసింది. పాక్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.




















