IND VS WI 1st Test Latest Updates: బుమ్రా ఆడటంపై సస్పెన్స్.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ పై అందరి దృష్టి.. అహ్మదాబాద్ లో తొలి టెస్టు
2 టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి తొలి టెస్టు లో విండీస్ తో ఇండియా తలపడనుంది. మ్యాచ్ కు సంబంధించి, ప్లేయింగ్ లెవన్ పై సస్పెన్స్ నెలకొంది. ముఖ్యంగా బుమ్రా గురించి చర్చ జరుగుతోంది.

Ind Vs WI Jasprit Bumrah Latest News: టీమిండియా సరికొత్త సమరానికి సిద్ధం అయ్యింది. గురువారం నుంచి వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా పైనే ఉంది. రెండు టెస్టుల సిరీస్ లో తను రెండు మ్యాచ్ లు ఆడతాడా..? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే దీనిపై భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ స్పందించాడు. ఈ సిరీస్ లో బుమ్రా ఎన్ని మ్యాచ్ లు ఆడతాడో, అనేది ముందే చెప్పలేమని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ , మ్యాచ్ కు పొజిషన్ ను బట్టి, బుమ్రా అవైలబులిటీ గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. నిజానికి గత జూన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ నుంచే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై చర్చ జరిగింది. ఐదు టెస్టుల సిరీస్ లో కేవలం మూడు మ్యాచ్ ల్లోనే తను బరిలోకి దిగాడు.
Nothing is pre-decided,” says Shubman Gill on team selection vs West Indies. India will play on wickets favoring both batters & bowlers, while Jasprit Bumrah’s availability remains under consideration. ⚡🏏 #INDvsWI #CricketNews #TeamIndia pic.twitter.com/gqO1QSOSqX
— Global Sports (@GlobalSportsX) October 1, 2025
స్విచ్ అవడం కష్టమే..
ఇక టెస్టు సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు టీ20లను ఆడామని, సడెన్ గా టెస్టులకు స్విచ్ అవడం కాస్త కష్టమేనని గిల్ తెలిపాడు. అయినప్పటికీ, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత సెప్టెంబర్ లో ఆసియాకప్ లో పాల్గొన్న భారత్, టైటిల్ ను నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో జరిగిన ఈ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా భారత్ గెలుపొందింది. ఇక అక్టోబర్ 2 నుంచి విండీస్ తో టెస్టు సిరీస్ లో తలపడనుంది.
అలా తేలిక..
ఇక టీ20ల నుంచి నేరుగా టెస్టులలో తలపడటం సవాలుతో కూడుకున్నదని, శైలిని మార్చుకోవాల్సి ఉందని గిల్ తెలిపాడు. అలా కాకుండా టీ20ల నుంచి వన్డేలు, వన్డేల నుంచి టెస్టులు ఆడితే ఫార్మాట్ అలవాటుపడటానికి తగినంత సమయం ఉంటుందని వ్యాఖ్యానించాడు. బ్యాటర్లకు ఈ విషయంలో కాస్త వెసులు బాటు ఉంటుందని, బౌలర్లు మాత్రం కాస్త కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ లో ఈనెల 2 నుంచి 6 వరకు తొలి టెస్టు, ఈనెల 10 నుంచి 14 వరకు ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా ఈ టెస్టు సిరీస్ జరుగనుంది.




















