అన్వేషించండి

Navdeep Saini: వైభవంగా నవదీప్‌ సైనీ పెళ్లి , పెళ్లి కూతురు ఎవరంటే..?

Indian pacer Navdeep Saini: టీమిండియాలో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ పెళ్లి వైభవంగా జరిగింది.

టీమిండియాలో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే కేఎల్ రాహుల్(KL Rahul), రుతురాజ్ గైక్వాడ్(Rutu Raj ), జస్‌ప్రీత్ బుమ్రా(Bumrah) పెళ్లి చేసుకోగా.... వెంకటేష్‌ అయ్యర్‌(Venkatesh Ayyar) నిశ్చితార్థం జరిగింది. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ(Navdeep Shine) పెళ్లి వైభవంగా జరిగింది.  తన ప్రేయసి స్వాతి ఆస్థాన(Swati Asthana )ను నవదీప్ సైనీ  వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమ లోకంలో విహరించిన వీరిద్దరూ అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నవదీప్ సైని వెల్లడించాడు. తన వివాహం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన నవదీప్ సైని.. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన తమకు మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలంటూ అభిమానులను కోరాడు. నీతో ప్రతిరోజు ప్రేమ‌తో నిండిందేనని. ఈరోజుతో మ‌నం ఆ ప్రేమ‌ను శాశ్వతం చేస్తున్నామని ఇన్‌ స్టా పోస్ట్‌లో సైనీ స్వాతిపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. 

ఇంట్లో పెద్దవాళ్లు  పెళ్లికి అంగీకారం తెలపడంతో నవదీప్ సైనీ-స్వాతి ఆస్థాన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌లోని దేబారి ఆనందం రిస్టార్స్‌లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆచారాల ప్రకారం.. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవదీప్ సైని పెళ్లాడిన స్వాతి అస్థానా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన స్వాతి ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అంశాలపై వీడియోలు చేస్తుంటారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రోజువారీ కార్యకలాపాలు, ట్రావెలింగ్ మీద వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. స్వాతి అస్తానా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు 80 వేలమంది వరకూ ఫాలోవర్లు ఉన్నారు. నవదీప్ సైనీ-స్వాతి దంపతులకు భారత క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్పీ సింగ్‌, రాహుల్‌ తెవాటియా సోషల్‌ మీడియాలో సైనీకి శుభాకాంక్షలు తెలిపారు. 

హర్యానాకు చెందిన నవదీప్ సైనీ 2019 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లు ఆడిన అతడు ఆ తర్వాత వన్డేలు, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో నవదీప్ సైనీ 8 వన్డేలు, రెండు టెస్టులు, 11 టీ20లు ఆడాడు. అన్నింటిలోనూ కలిపి మొత్తం 32 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. చివరగా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడాడు. ఐపీఎల్‌లో గత ఏడాది రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ఆడాడు. హర్యానాకు చెందిన నవదీప్‌ సైనీకి 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడని పేరొంది. అయితే గాయాల కారణంగా జట్టులోకి వస్తూపోతూ ఉన్నాడు. 

ఇటీవలే భార‌త యువ క్రికెట‌ర్(Indian Cricketer) , ఆల్‌రౌండర్‌ వెంక‌టేశ్ అయ్యర్( Venkatesh Iyer) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను త్వర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) లో కోల్ కతా నైట్ రైడర్స్(kolkata knight riders) తరపున ఆడుతూ పాపుల‌ర్ అయిన అయ్యర్.. శృతి ర‌ఘునాథ‌న్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అయ్యర్‌ స్వయంగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీరిద్దరి నిశ్చితార్థం క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. ఇరువురి కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక జరిగింది. అయ్యర్, శృతి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Pizza: పిజ్జాలో పవర్ ఫుల్ నైఫ్ - షాకైన కస్టమర్
పిజ్జాలో పవర్ ఫుల్ నైఫ్ - షాకైన కస్టమర్
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Embed widget