అన్వేషించండి

India vs Zimbabwe: యువ భారత్‌ వేట, జింబాబ్వే ఆపగలదా? తొలి మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ?

ZIM Vs IND 2024: టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ కెప్టెన్‌గా యువ ఆటగాళ్ళు నేడు పసికూన జింబాబ్వేతో తలపడనున్నారు. ఈ సిరీస్‌లో విధ్వంసం సృష్టించి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

India vs Zimbabwe Preview: టీ 20 ప్రపంచకప్ (T20 World Cup)వేట అలా ఆరంభమైందో లేదో.. ఇక యువ భారత్‌ వేట ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుని ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యువ టీమిండియా(India). పసికూన జింబాబ్వే(Zimbabwe)తో టీ 20 సిరీస్‌కు సిద్ధమైంది. టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్(Shubman Gill) సారథ్యంలో పూర్తిగా యువ ఆటగాళ్లే ఈ పర్యటనలో బరిలోకి దిగనున్నారు. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వేళ... జింబాబ్వే సిరీస్‌లో విధ్వంసం సృష్టించి... జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యువ ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.

Image

ఇవాళ హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో తొలి టీ 20 మ్యాచ్‌ జరగనుండగా... ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఆత్మ విశ్వాసంతో ప్రారంభించాలని భారత జట్టు...యువ భారత్‌కు షాక్ ఇవ్వాలని సికిందర్‌ రాజా సారథ్యంలోని జింబాబ్వే భావిస్తున్నాయి. అయితే జింబాబ్వేలో ఈ మ్యాచ్‌ జరగనుండడం... హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లోని పిచ్‌పై జింబాబ్వే ఆటగాళ్లకు అవగాహన ఉండడంతో ఈ మ్యాచ్‌... ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. జింబాబ్వే సారధి సికిందర్‌ రజా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్‌ కొనసాగితే యువ భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకునేందుకు జింబాబ్వే సారధి రజాకు కేవలం 53 పరుగుల దూరంలో ఉన్నాడు. 14 ఏళ్ల వ్యవధిలో జింబాబ్వే-భారత్‌  కేవలం ఎనిమిది టీ20ల్లో మాత్రమే తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఆరు మ్యాచుల్లో గెలవగా... జింబాబ్వే రెండుసార్లు భారత్‌కు షాక్ ఇచ్చింది.  

Image

భవిష్యత్తు నిర్మించుకునే దిశగా...
T 20 ప్రపంచకప్ గెలిచి ఓ వైపు టీమిండియా చరిత్ర సృష్టించగా... మరోవైపు భవిష్యత్తు నిర్మాణం దిశగా టీమిండియా నడుస్తోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న పదిహేను మంది యువ ఆటగాళ్లకు... భారత భవిష్యత్తుపై నమ్మకం కలిగించే సువర్ణ అవకాశం దక్కింది. శుభ్‌మన్‌ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్... జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదలో ఉన్నారు. టీ 20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌గా ఉన్న రింకూ సింగ్ ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాలని రింకూ గట్టి పట్టుదలతో ఉన్నాడు. రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌లో రాణించి భవిష్యత్తులో జట్టులో స్థానం సుస్ధిరం చేసుకోవాలని చూస్తున్నారు. 
Image
 
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధృవ్ జురెల్/జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్,  తుషార్ దేశ్‌పాండే,  ఖలీల్ అహ్మద్ 
Image
 
జింబాబ్వే జట్టు: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, అంటుమ్ నఖ్వీ, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, ఫరాజ్ వెల్‌లింగ్టన్, దీవెన ముజారబానీ
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
Israeli: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
Israeli: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Devara 2: ‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్
‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Embed widget