అన్వేషించండి
Advertisement
India vs Zimbabwe 3rd T20I: మూడో టీ20 మనదే- మెరిసిన గిల్, రుతురాజ్- జింబాబ్వేపై వరుసగా రెండో విజయం
IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మరో రెండు టీ20లు ఆడాల్సి ఉంది.
India vs Zimbabwe 3rd T20I highlights : జింబాబ్వే(ZIM) పర్యటనలో ఉన్న టీమిండియా(India) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న భారత జట్టు వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సత్తా చాటింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రాణించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే159 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
🔙 to 🔙 wins in Harare 🙌
— BCCI (@BCCI) July 10, 2024
A 23-run victory in the 3rd T20I as #TeamIndia now lead the series 2⃣-1⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/ZXUBq414bI
నిలిచిన గిల్, రుతురాజ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్-యశస్వీ జైస్వాల్ వచ్చారు. వీరిద్దరూ మంచి పునాది వేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. ఆరంభం నుంచే గిల్-జైస్వాల్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఎనిమిది ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. ధాటిగా ఆడుతూ భారీ స్కోరు దిశగా సాగుతున్న యశస్వీ జైస్వాల్‌ను అవుట్ చేసిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా జింబాబ్వేకు తొలి బ్రేక్ ఇచ్చాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో యశస్వీ జైస్వాల్ 36 పరుగులు చేశాడు.
అనంతరం ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అభిషేక్ శర్మ నిరాశ పరిచాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ఈ నయా సెన్సేషన్... కేవలం పది పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. తొమ్మిది బంతుల్లో ఒక ఫోర్‌తో 10 పరుగులు చేసిన అభిషేక్ శర్మను కూడా సికిందర్ రజానే అవుట్ చేశాడు. దీంతో టీమిండియా జోరు కాస్త తగ్గింది. 15 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ కాస్త నెమ్మదించింది. అయితే గిల్‌తో జత కలిసిన రుతురాజ్ జింబాబ్వేపై మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌లోనూ రాణించిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఓవైపు గిల్, మరోవైపు రుతురాజ్ జింబాబ్వే బౌలర్లను ఆడుకున్నారు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ దూకుడుతో టీమిండియా 12.4 ఓవర్లలో వంద పరుగుల మైలురాయిని దాటింది. ఆ తర్వాత స్కోరు వేగం మరింత పెంచే క్రమంలో గిల్ అవుటయ్యాడు. 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో గిల్ 66 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 49 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
చతికిలపడ్డ జింబాబ్వే
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలోనే జింబాబ్వే ఓటమి ఖరారైపోయింది. .. 31 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూడా కోల్పోవడంతో భారత్ విజయం దాదాపు ఖాయమైంది. అయితే మేయర్స్ పోరాడాడు. క్లీవ్ మధాండే కూడా కాసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. మేయర్స్ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధాండే 37 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion