IND vs WI, 1st Test: రెండేండ్ల లక్ష్యానికి నేటి నుంచే తొలి పరీక్ష - విండీస్‌తో తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా
భారత్ - వెస్టిండీస్ మధ్య డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్‌కు రానుంది.
IND vs WI, 1st Test: వరుసగా రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఓడిన టీమిండియా.. నేటి నుంచి మరో టైటిల్ రేసు మొదలుపెట్టింది. నెల రోజుల స్వల్ప విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ ఆడుతున్నది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓడి బౌలింగ్‌కు రానుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయనుంది. అందరూ ఊహించినట్టుగానే యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో పాటు ఇషాన్ కిషన్‌లు టెస్టులలో అరంగేట్రం చేశారు.
ఈ సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్‌తో పాటు తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌లు బెంచ్‌కే పరిమితమయ్యారు. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతున్నది. సిరాజ్ సారథ్యంలోని భారత పేస్ దళంలో.. శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పక్కనబెట్టిన అశ్విన్ తిరిగి వచ్చాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. బ్యాటర్లుగా రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రహానే, ఇషాన్ కిషన్ ఉండగా.. జడేజా, అశ్విన్ కూడా లోయరార్డర్ బాధ్యతలు మోయనున్నారు.
Two debutants for #TeamIndia.
— BCCI (@BCCI) July 12, 2023
A look at our Playing XI for the 1st Test.
Live - https://t.co/FWI05P59cL… #WIvIND pic.twitter.com/dArjNP2o87
ఇక వెస్టిండీస్ జట్టు తరఫున అథనాజ్ అరంగేట్రం చేయనున్నాడు. కిర్క్ మెకంజీ, షానూన్ గాబ్రియాల్‌కు జట్టులో చోటు దక్కలేదు. రెండేండ్ల తర్వాత కార్న్‌వాల్ జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు వారికన్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు.
Congratulations to Yashasvi Jaiswal and Ishan Kishan who are all set to make their Test debut for #TeamIndia.
— BCCI (@BCCI) July 12, 2023
Go well, lads!#WIvIND pic.twitter.com/h2lIvgU6Zp
🚨Debut Alert🚨
— Windies Cricket (@windiescricket) July 12, 2023
Alick Athanaze will debut in front of his hometown crowd today.🙌🏾 #WIvIND #WIHome pic.twitter.com/jFJ3CFqddP
జట్ల వివరాలు :
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్
వెస్టిండీస్ జట్టు : క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగినరైన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జోషువా డ సిల్వ, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్, రేమన్ రీఫర్
టీవీలో చూడటం ఎలా..?
తొలి టెస్టుతో పాటు వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లు అన్నీ టెలివిజన్‌లో చూడాలనుకునేవారికి దూరదర్శన్ గుడ్ న్యూస్ చెప్పింది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లను ఉచితంగానే వీక్షించొచ్చు. హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, తెలుగు, కన్నడ, తమిళ్‌లో లైవ్ ప్రసారాలు చూడొచ్చు. తెలుగులో చూసేవాళ్లు డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి ఛానెల్స్‌లో మ్యాచ్‌లను ఫ్రీగా చూసేయొచ్చు. టీవీల ద్వారా కాకుండా మొబైల్స్‌లో ఈ మ్యాచ్‌లను చూడాలనుకునేవారు జియో మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. ఫ్యాన్ కోడ్ (వెస్టిండీస్ అధికారిక ప్రసారదారు) యాప్, వెబ్‌సైట్‌లో కూడా వీటిని వీక్షించొచ్చు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial