IND vs SA: సౌతాఫ్రికాతో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు టీమిండియాలో ఆడేదెవరు? జోహన్నెస్‌బర్గ్‌లో వాతావరణం ఎలా ఉంది?
IND vs SA 4th T20: దక్షిణాఫ్రికాపై నాల్గో మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా వ్యూహం రచిస్తోంది. అయితే సిరీస్‌ను డ్రాగా ముగించాలని సఫారీలు ప్రతివ్యూహంతో దిగుతున్నారు.
IND vs SA 4th T20 Possible Playing XI: దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు భారత్ నాల్గో టీ20 మ్యాచ్ ఆడనుంది. భారత్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాపై 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. సిరీస్‌లో ఇప్పుడు భారత్ పైచేయి సాధించింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయిన సిరీస్ మాత్రం కోల్పోదు. కానీ సిరీస్ డ్రా అవుతుంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న కసితో టీమిండియా ఉంది.
సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో భారత జట్టు 11 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఆ మ్యాచ్‌లో రమణదీప్ సింగ్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. మరి చివరి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఎన్ని మార్పులు చేస్తుందో చూడాలి.
పిచ్ స్వభావాన్ని పరిశీలిస్తే.. టీ20 మ్యాచ్‌ల్లో జోహన్నెస్ బర్గ్ పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది, అక్కడ బంతి నేరుగా బ్యాట్ మీదకు వస్తుంది. ఈ మైదానంలో ఒక ఇన్నింగ్స్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు ఖాయం. కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగులే ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు. అటువంటి పరిస్థితిలో రెండు జట్లూ తమ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండాలని చూసుకుంటాయి. ఫాస్ట్ బౌలర్లు మొదట్లోనే పైచేయి సాధించాలని చూస్తారు. తర్వాత పిచ్ స్పిన్‌కు ప్రభావితం అవుతుంది. అందుకే స్టార్టింగ్‌లోనే వికెట్లు తీయాలని సీమర్లు ప్రయత్నిస్తారు.
టీమ్ ఇండియాలో మార్పులు ఉంటాయా?
జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానం గత చరిత్ర పరిశీలిస్తే కచ్చితంగా ముగ్గురు పేసర్లతో ఆడటం అవసరం. అటువంటి పరిస్థితిలో స్పిన్ బౌలర్‌ను వదిలిపెట్టి టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అదనపు ఫాస్ట్ బౌలర్‌ను చేర్చుకునే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బౌలింగ్ చేయని రమణదీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో తప్పించే అవకాశం ఉంది.
రమణదీప్ స్థానంలోకి యశ్ దయాల్, విజయ్‌కుమార్ లేదా అవేష్ ఖాన్ రావచ్చు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి మళ్లీ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోవచ్చు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ సెంచరీ చేసినా, ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా స్కోరుకే ఔటయ్యాడు. అయినప్పటికీ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్
జోహన్నెస్‌బర్గ్‌లో వాతావరణం ఎలా ఉందంటే?
జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో వర్షాలు పడే అవకాశం లేదు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌కు ఎలాంటి వాతావరణం అడ్డంకి లేదు. ఇక్కడ మ్యాచ్ టైంలో 23 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
2-1 తేడాతో ఆధిక్యంలో భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా జయకేతనం ఎగరేసింది. మళ్లీ మూడో మ్యాచ్‌ను సూర్యకుమార్ సేన కైవశం చేసుకుంది. ఇప్పుడు నాల్గో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది
Also Read: అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కుమారుడు- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్