అన్వేషించండి
Advertisement
India vs South Africa: రెండవ టి 20 కి యువ భారత్ సిద్ధం, పొంచి ఉన్న వర్షం ముప్పు
India vs South Africa 2nd T20:దక్షిణాఫ్రికాలో పర్యటనలో సత్తాచాటి వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్పు జట్టులో స్థానం సాధించాలని చూస్తున్న కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం.
దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మెుదటి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో నిరాశలో ఉన్న యువభారత్ రెండో టీ20కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మంగళవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా కెబెరాలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ జరిగేదానిపై సందేహాలు నెలకొన్నాయి.
దక్షిణాఫ్రికాలో పర్యటనలో సత్తాచాటి. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్పు జట్టులో స్థానం సాధించాలని చూస్తున్న కుర్రాళ్లకు మెుదటి టీ20 వర్షం కారణంగా రద్దవడం నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి. ఈసారి టీ20 ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని పట్టుదలతో ఉన్న టీమిండియా.. ఆ మెగా టోర్నీకి ముందే బలమైన జట్టును గుర్తించాలనే ప్రక్రియను చేపట్టింది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షించి... పొట్టి ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేయాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తోంది.
మెుదటి మ్యాచ్‌కు వర్షం రూపంలో ఆటంకం ఎదురవ్వగా మంగళవారం జరిగే రెండో టీ 20లో అయినా సత్తా చాటాలని యువభారత్ కసిగా ఉంది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా కెబెరాలో రెండో టీ20 జరగనుంది. సెయింట్ జార్జ్ పార్క్ పిచ్ బ్యాటింగ్... అనుకూలించే అవకాశం ఉంది. మెుదట బ్యాటర్‌లకు పిచ్ సహాయాన్ని అందించనుంది. ఆట సాగుతున్న కొద్దీ...బౌలర్లకు అనుకూలంగా మారనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా..... వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ జరిగేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న వేళ...ఈ సిరీస్‌లో రాణించి జట్టులో తమ స్థానాన్ని... పదిలం చేసుకోవాలనుకున్న యువ ఆటగాళ్లు నిరాశతో ఉన్నారు. ప్రపంచకప్‌నకు ముందు భారత్ జట్టు కేవలం ఆరు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ జట్టు బ్యాటింగ్‌లో... బలంగా కనిపిస్తోంది. ఉంది. శుభ్‌మన్‌గిల్, రుతురాజ్ గైక్వాడ్,యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్,ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మ, రింకూ సింగ్‌లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గిల్‌తో జైస్వాల్ ఓపెనింగ్‌కు దిగే అవకాశం ఉండటంతో ఫామ్‌లోఉన్న రుతురాజ్ బెంచ్‌కు పరిమితంకావచ్చు. టీ20 ప్రపంచ కప్పులో.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడేదానిపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో.. ఆ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని జట్టు మెనేజ్‌మెంట్ చూస్తోంది.తర్వాతి స్థానాల్లో అయ్యర్, సూర్యకుమార్‌లు రానున్నారు. భవిష్యత్తులో భారత్ జట్టుకు మంచి ఫినిషినర్‌గా అవుతాడని భావిస్తున్నా.. రింకూ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మాక్రమ్, హార్డ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్‌లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియా బౌలింగ్ విభాగమే ఆందోళనపరుస్తోంది. పేస్ అనుకూలించే ప్రోటీస్ పిచ్‌లపై మన పేసర్లు.... ఏమేరకు రాణిస్తోరో చూడాలి. సిరాజ్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.టీ 20ల్లో నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, వన్డే ప్రపంచకప్పులో రాణించిన... కులీదీప్ యాదవ్‌లో ఒకరు జడేజాతో స్పిన్... బాధ్యతలను పంచుకోనున్నారు. కగిసో రబాడ.. ఎంగిడి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనా జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఫెహ్లుక్వాయో పేస్‌తో భారత బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
టీమిండియా జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion