అన్వేషించండి
Advertisement
IND vs SA : నిప్పులు చెరిగిన భారత పేసర్లు, 116 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
IND vs SA : జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ల ధాటికి ఆతిథ్య దక్షిణాఫ్రికా విలవిల్లాడింది.
జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ల ధాటికి ఆతిథ్య దక్షిణాఫ్రికా విలవిల్లాడింది. పేసర్లు అర్ష్‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ నిప్పులు చెరగడంతో పేసర్లు చెలరేగడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత్ తరపున సాయి సుదర్శన్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమానికి మద్దతుగా దక్షిణాఫ్రికా జట్టు పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. తొలి ఓవర్ నుంచే భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. రెండో ఓవర్‌లోనే వరుసగా రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ సఫారీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. 1.4 ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్‌ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని హెండ్రిక్స్ వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాండర్ డసెన్‌ను అర్ష్‌దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అర్ష్‌దీప్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన డసెన్ ఎల్బీ అయ్యాడు. అంపైర్ ఔట్ ఇచ్చినా.. డసెన్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ రావడంతో డసెన్‌కు నిరాశ గా వెనుదిరిగాడు.దీంతో మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సఫారీలు కష్టాల్లో పడ్డారు.
ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. జట్టు స్కోరు 42 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా అర్ష్‌దీప్ ఖాతాలోనే పడింది. ఎనిమిదో ఓవర్లో భారీషాట్ కొట్టబోయిన జోర్జి వికెట్ కీపర్ చేతికి చిక్కి అవుటయ్యాడు. ఓపెనర్ జోర్జి 28 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 42 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కాసేపటికే అర్ష్‌దీప్ మరో వికెట్ తీసి సఫారీలను మరింత కష్టాల్లోకి నెట్టాడు. పదో ఓవర్ చివరి బంతికి ఆరు పరుగులు చేసిన క్లాసెన్‌ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో అర్ష్‌దీప్ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. 52 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ను కోల్పోయింది.అనంతరం ఆవేశ్‌ఖాన్... ప్రొటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరుసగా రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. పదకొండో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు.
క్లాసెన్‌ను బౌల్డ్ చేసిన ఆవేశ్‌ఖాన్.. ఆ తర్వాతి బంతికే ముల్దర్‌ను వికెట్ల ముందు దొరకబుచుకున్నాడు. ఎల్బీ ఔట్ ఇచ్చిన అంపైర్ నిర్ణయంపై ముల్దర్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అంపైర్స్ కాల్’ రావడంతో ముల్దర్ పెవిలియన్ బాట తప్పలేదు. ముల్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 58 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను నష్టపోయింది. కాసేపటికే మరో వికెట్ తీసిన ఆవేశ్‌ఖాన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను త్వరగా ముగింపు పలికాడు. అవేశ్ వేసిన బంతిని ఆడబోయిన కేశవ్ షార్ట్ కవర్‌లోని రుతురాజ్ చేతికి చిక్కాడు. దీంతో 73 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అవేశ్ ఖాన్‌కు నాలుగో వికెట్ దక్కింది. తొలి నాలుగు వికెట్లు అర్ష్‌దీప్‌సింగ్ తీయగా... తర్వాతి నాలుగు వికెట్లు ఆవేశ్‌ఖాన్ తీశాడు. ఈ ఇద్దరు పేసర్లు చెలరేగడంతో 27.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 116 పరుగులకే ఆలౌట్ అయింది. సొంతగడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ప్రొటీస్ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion