Ind vs Pak Womens World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
India Vs Pakistan | వన్డే వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద భారత్ ఏకంగా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్ కేవలం 159 పరుగులకు చాప చుట్టేసింది.

India Vs Pakistan Womens World Cup | కొలంబో: వన్డే ప్రపంచ కప్ 2025లో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించింది. పాక్ మీద ఆదివారం జరిగిన డే అండ్ నైట్ వన్డేలో 88 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 43 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్ సిద్రా అమిన్ (88 పరుగులు) చేయడంతో ఆ జట్టు పరువు కాపాడుకుంది. లేకపోతే వంద లోపే చాప చుట్టేసేది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, స్నేహ్ రాణా 2 వికెట్లతో రాణించింది.
భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకూ 12 సార్లు వన్డేలు ఆడాయి. అయితే భారత జట్టు ప్రతిసారీ పాక్ మీద విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 247 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ గెలుపు రికార్డు మరింత మెరుగైంది.
World Cup 2025. India (Women) Won by 88 Run(s) https://t.co/9BNvQl3bfB #INDvPAK #CWC25 #TeamIndia
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. స్లో పిచ్‌లో, ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా అర్ధశతకం చేయలేకపోయారు. భారత్ తరఫున హర్లీన్ డియోల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ప్రతీకా రావల్ 31, జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులు చేశారు. రిచా ఘోష్ చివరి ఓవర్లలో 20 బంతుల్లో 35 పరుగులు చేస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టును 247 పరుగులు చేసింది.
పాకిస్తాన్ ఘోర ఓటమి
పాకిస్తాన్ ఆట చాలా దారుణంగా ఉంది. 20 పరుగులు చేయకముందే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. ఓపెనర్ మునీబా అలీ వికెట్ వార్తల్లో నిలిచింది. వీడియో రీప్లేను రెండుసార్లు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ ఆమెను రనౌట్ ఇచ్చారు. మొదటి 20 ఓవర్లలో పాకిస్తాన్ రన్ రేట్ 3 కంటే తక్కువగా ఉంది. క్రాంతి గౌడ్ వేసిన అద్భుత బౌలింగ్ అందుకు కారణం. తోటి బౌలర్ల నుంచి సహకారం లభించడంతో ఆమె చెలరేగి పాక్ భరతం పట్టింది.
సిద్రా అమీన్, నటాలియా పర్వేజ్ 69 పరుగుల భాగస్వామ్యంతో పాకిస్తాన్ పరువు కాపాడారు. పర్వేజ్ 39 పరుగులకు ఔట్ కాగా, ఆ తర్వాత పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 2 పరుగులకే ఔటైంది. పాకిస్తాన్ తన చివరి 5 వికెట్లను కేవలం 16 పరుగులకే కోల్పోయింది. సిద్రా అమీన్ 81 పరుగుల ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నా.. జట్టుకు 88 పరుగుల భారీ ఓటమి తప్పలేదు.
जीत
— ओम प्रकाश माथुर (Om Prakash Mathur ) (@OmMathur_Raj) October 5, 2025
फिर जीत
हर बार जीत
महिलाओं ने पाकिस्तान को फिर खदेड़ा @PMOIndia #INDWvPAKW #ICCWomensWorldCup2025 pic.twitter.com/4SuKjGKvHA
12-0 తేడాతో అజేయమైన రికార్డు
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు వరుసగా 12వ సారి పాక్ జట్టును ఓడించింది. ఈ రెండు జట్లు తొలిసారి 2005లో వన్డేలో తలపడ్డాయి. అప్పటి నుంచి టీమిండియా వరల్డ్ కప్‌లో పాక్ మీద ప్రతి వన్డేలోనూ ఆధిపత్యం చెలాయించింది.





















