అన్వేషించండి

India vs Pakistan U19 Asia Cup 2023: పాక్‌ చేతిలో యువ భారత్‌ ఓటమి , రేపే నేపాల్‌తో కీలక పోరు

India vs Pakistan U19 Asia Cup 2023: ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో భారత యువ జట్టుకు చుక్కెదురైంది.

ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో భారత యువ జట్టుకు చుక్కెదురైంది. ఆసియాకప్‌లో ఇప్పటివరకూ ఓటమంటూ ఎరుగకుండా ముందుకు సాగిన టైటిల్‌ ఫేవరెట్‌ అయిన యువ భారత్ ఈ ఓటమితో డీలాపడింది. గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో పాకిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌ (62), కెప్టెన్‌ ఉదయ్‌ సహ్రాన్‌ (60), సచిన్‌ దాస్‌ (58) అర్ధ శతకాలు వ్యర్థమయ్యాయి. పాక్‌ బౌలర్లు మహ్మద్‌ జీషన్‌ (4/46), ఆమిర్‌ హసన్‌ (2/56), ఉబేద్‌ షా (2/49) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. అనంతరం పాక్‌ బ్యాటర్‌ అజాన్‌ అవైస్‌ (105 నాటౌట్‌) అజేయ శతకంతో సత్తాచాటడంతో పాక్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.  పాక్‌ మరో 18 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 47 ఓవర్లలో 2 వికెట్లకు 263 పరుగులు సాధించింది. అజాన్‌ సెంచరీకి.. షాజైబ్‌ ఖాన్‌ (63), కెప్టెన్‌ సాద్‌ బేగ్‌ (68 నాటౌట్‌) అర్ధ శతకాలు తోడవడంతో పాక్‌ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. భారత బౌలర్‌ మురుగన్‌ అభిషేక్‌ (2/55)కు రెండు వికెట్లు దక్కాయి. 

రేపు నేపాల్‌తో భారత్‌ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల నుంచి రెండు పాయింట్లు సాధించిన భారత్‌.. సెమీస్‌ చేరాలంటే నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి. ఈ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ నంబర్‌ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్‌ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోరకు సిద్ధమవుతోంది

అండర్‌-19 ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో అఫ్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్ఘాన్‌ నిర్ధేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అర్షిన్‌ కులకర్ణీ ముందు బౌలింగ్‌లో (3/46), తర్వాత బ్యాటింగ్‌లో (70 నాటౌట్‌; 105 బంతుల్లో 4 ఫోర్లు) సత్తా చాటాడు. దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ అండర్‌-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైపోయింది.

భారత బౌలర్లు ఆరంభ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో అఎn్గాన్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అర్షిన్‌ కులకర్ణీ 3, రాజ్‌ లింబానీ 3 వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌ ఆరంభం కలిసి రాలేదు. ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌ (14), రుద్ర పటేల్‌ (5) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణీ, సారథి ఉదయ్‌ శరణ్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. భారత్‌ 76 స్కోరు వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షిన్‌ కులకర్ణీ (70 నాటౌట్‌; 105 బంతుల్లో 4 ఫోర్లు), ముషీర్‌ ఖాన్‌ (48 నాటౌట్‌; 53 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్పించారు. భారత్‌ 37.3 ఓవర్లలో 174/3 పరుగులు చేసి టోర్నీలో శుభారంభం చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget