(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma: ఆటకు ముందే పాక్‌పై ప్రశంసలు! ప్రపంచ నెం.1తో పోటీ ఈజీ కాదంటూ రోహిత్ సిగ్నల్!
Rohit Sharma: దాయాది పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టెంతో కష్టపడిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
Rohit Sharma:
దాయాది పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టెంతో కష్టపడిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. బాబర్ సేన మంచి ఫామ్‌లో ఉందన్నాడు. ఆసియాకప్‌లో వారితో పోటీ తమకు మంచి సవాల్‌గా పేర్కొన్నాడు. బాబర్ సేనతో మ్యాచుకు ముందు పల్లెకెలెలో మీడియాతో మాట్లాడాడు.
'ఆసియాకప్‌లో ఆరు మంచి జట్లు పోటీపడుతున్నాయి. తమదైన రోజున ఎవరు ఎవరినైనా ఓడించగలరు. రెండు దేశాల శత్రుత్వం గురించి జనాలు మాట్లాడుకుంటారు. అయితే జట్టుగా మా దృక్పథం మరోలా ఉంటుంది. రేప్పొద్దున ఒక ప్రత్యర్థితో మేం తలపడాల్సి ఉంటుందని మేం భావిస్తాం. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మేం గెలవగలం. అవే మాకు సాయపడతాయి. పాకిస్థాన్ ఈ మధ్యన టీ20, వన్డేల్లో మెరుగ్గా ఆడుతోంది. ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగేందుకు వారెంతో శ్రమించారు. ఆదివారం వారితో మాకు గొప్ప సవాల్ ఎదురవ్వనుంది' అని రోహిత్ శర్మ అన్నాడు.
ఆసియాకప్ 2023లో శనివారం భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. పల్లెకెలె ఇందుకు వేదిక. ఇప్పటికే దాయాది ఒక విజయం సాధించింది. పసికూన నేపాల్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. అయితే చివరి ఐదు వన్డేల్లో బాబర్ సేనపై టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. 4-1తో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మధ్యే హిట్‌మ్యాన్ సేన వెస్టిండీస్‌లో వన్డే సిరీస్ ఆడింది. 2-1తో కరీబియన్లను ఓడించింది. ఆ సిరీస్ తర్వాత విశ్రాంతి లభించడంతో ఆటగాళ్లంతా తాజాగా ఉన్నారు. శుక్రవారం క్యాండీలో సాధన చేశారు.
1984లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకూ భారత్ - పాక్‌లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ వైపునకే మొగ్గు ఉంది. ఏడు మ్యాచ్‌లలో టీమిండియా నెగ్గగా ఐదు మ్యాచ్‌లను మెన్ ఇన్ గ్రీన్ గెలుచుకున్నారు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 53.85 శాతంగా ఉండగా, పాక్‌కు 35.71 శాతంగానే ఉంది.
ఆసియా కప్‌లో ఈ ఏడాది భారత్ మ్యాచ్‌లు అన్నీ శ్రీలంక వేదికగానే జరుగుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌లో భాగంగా లంకలో మూడు మ్యాచ్‌లు ఆడాయి. తలా ఓ మ్యాచ్ గెలవగా ఓ వన్డేలో ఫలితం తేలలేదు. 2004 ఆసియా కప్‌లో కొలంబో (ప్రేమదాస స్టేడియం) వన్డేను భారత్ నెగ్గగా.. దంబుల్లా వేదికగా 2010లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. మరి శనివారం దాయాదుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఆసియా కప్‌లో ఈ ఏడాది భారత్ మ్యాచ్‌లు అన్నీ శ్రీలంక వేదికగానే జరుగుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌లో భాగంగా లంకలో మూడు మ్యాచ్‌లు ఆడాయి. తలా ఓ మ్యాచ్ గెలవగా ఓ వన్డేలో ఫలితం తేలలేదు. 2004 ఆసియా కప్‌లో కొలంబో (ప్రేమదాస స్టేడియం) వన్డేను భారత్ నెగ్గగా.. దంబుల్లా వేదికగా 2010లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. మరి శనివారం దాయాదుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Also Read: సూర్యకు తిరస్కారమే! - ఇషాన్ ఎంట్రీ - పాక్‌పై పోరులో టీమిండియా ఇదేనా?