అన్వేషించండి

IND vs PAK: బాబర్‌దే టాస్ లక్కు! అతడి ప్లేస్‌లో కేఎల్‌ రాహుల్‌కు చోటు

IND vs PAK: ఆసియాకప్‌ 2023లో సూపర్‌ 4 దశ జరుగుతోంది. ప్రేమ దాస స్టేడియం వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ తలపడుతున్నాయి.

IND vs PAK: 

ఆసియాకప్‌ 2023లో సూపర్‌ 4 దశ జరుగుతోంది. ప్రేమ దాస స్టేడియం వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ టాస్ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

బాబర్‌ ఆజామ్‌ ఏమన్నాడంటే?

మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. వాతావరణంలో కాస్త తేమ కనిపిస్తోంది. దానిని మేం ఉపయోగించుకుంటాం. భారత్‌, పాకిస్థాన్‌ అంటేనే ఎక్కువ తీవ్రత ఉంటుంది. కానీ మేం ఒక్కో మ్యాచ్‌ను ఆడుకుంటూ వెళ్తాం. జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఈ మ్యాచ్‌పై ఫోకస్‌ చేశాం. జట్టులో మార్పులేమీ లేవు.

రోహిత్‌ ఏమన్నాడంటే?

మేం మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. ఆట సాగే కొద్దీ మరింత కఠినంగా ఉంటుంది. కానీ చివరి సారి కుర్రాళ్లు ఆడిన తీరు ఆత్మవిశ్వాసాన్ని అందించింది. మాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. అయితే ఒకసారికి ఒక మ్యాచుపైనే దృష్టి సారిస్తాం. ఈ ఆటతీరే ఇంత. సన్నద్ధం అవ్వడానికి మాకు సమయం దొరికింది. రెండు మార్పులు చేశాం. జస్ప్రీత్‌ బుమ్రా తిరిగొచ్చాడు. వెన్ను నొప్పి వల్ల శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను తీసుకున్నాం.

పిచ్‌ రిపోర్టు

'ఎండ బాగానే ఉంది. ఆకాశంలో కారు మబ్బులేమీ లేవు. క్యూరేటర్లు పిచ్‌ను నీటితో తడిపారు. దీనర్థం వాతావరణం మారొచ్చు. వికెట్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది. కొత్త బంతితో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. తేమ ఉండటంతో స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తారు' అని మాజీ క్రికెటర్లు సంజయ్‌ మంజ్రేకర్‌, వకార్‌ యూనిస్‌ అన్నారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

పాకిస్థాన్‌ జట్టు: ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్ ఖాన్‌, ఫహీమ్‌ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రౌఫ్‌ 

పాకిస్తాన్‌కు పేసర్లే బలం.. 

ఇటీవల కాలంలో పాకిస్తాన్ వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ జట్టు కావడానికి కారణం ఆ జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది,  నసీమ్ షా,  హరీస్ రౌఫ్‌లు  ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు కొత్తగా  నాలుగో పేసర్ కూడా వచ్చి చేరాడు. భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ ఏకంగా నలుగురు పేసరన్లతో బరిలోకి దిగుతోంది. ఆ నాలుగో ఫహీమ్ అష్రఫ్  కూడా జతకలిశాడు. షహీన్, నసీమ్, హరీస్‌ల బౌలింగ్‌‌లో ఆడేందుకే తలలు పట్టుకుంటున్న భారత బ్యాటర్లకు ఇది మరో కొత్త తలనొప్పే. గత మ్యాచ్ మాదిరిగానే   ప్రారంభ ఓవర్లలోనే  భారత్‌ను దెబ్బతీసి ఒత్తిడిలోకి నెట్టాలన్నది పాకిస్తాన్ పేసర్ల  ప్రణాళిక. పేస్‌కు సహకరించే  కొలంబో పిచ్‌పై నలుగురు పాక్ పేసర్లు భారత బ్యాటర్లకు మరోసారి నిద్రలేని రాత్రులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సవాల్‌ను  భారత  బ్యాటర్లు ఏ మేర ఛేదిస్తారు అనేది  ఆసక్తికరంగా మారింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Embed widget