India vs Ireland Match Highlights: ఐర్లాండ్ పై 8వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ, T20 వరల్డ్ కప్‌లో బోణీ
India vs Ireland T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ 2024ను రోహిత్ సేన విజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.
India vs Ireland T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్ లో తొలి లీగ్ మ్యాచ్ ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్వల్ప లక్ష్య చేధనను సునాయాసంగా చేధించిన టీమిండియా వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఇక్కడ చదవండి.
1. అదుర్స్ అర్ష్ దీప్ :
న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం కరెక్ట్ అని తేల్చేలా అర్ష్ దీప్ సింగ్ ఇనీషియల్ ఓవర్స్ లోనే ఐర్లాండ్ ను ఇబ్బంది పెట్టాడు. ఓపెనర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తో పాటు మరో ఓపెనర్ బాల్ బిర్నే ఇద్దరి వికెట్లూ అర్ష్ దీపే తీసుకున్నాడు. దీంతో ఐర్లాండ్ 9పరుగులకే 2వికెట్లు కోల్పోయింది.
2 హార్దిక్ పాండ్యా మాస్ కమ్ బ్యాక్ :
అర్ష్ దీప్ కు తోడుగా హార్దిక్ పాండ్యా తనదైన స్లో పేస్ బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాటర్లను ఆడుకున్నాడు. ఐపీఎల్ ఫామ్ లేమిని అధిగమిస్తూ వికెట్ కీపర్ టకర్, కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్ లను అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 27పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీయటం ద్వారా తానెంత విలువైన ఆల్ రౌండర్ నో ప్రూవ్ చేసుకున్నాడు.
WT20 2024. India Won by 8 Wicket(s) https://t.co/Yam05lIxPl #T20WorldCup #INDvIRE
— BCCI (@BCCI) June 5, 2024
3. బుమ్రా, సిరాజ్, అక్షర్ ఫినిషింగ్ :
అత్యంత పిసినారి బౌలింగ్ తో బుమ్రా ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో కేవలం 6పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, అక్షర్ పటేల్ కూడా చెరో వికెట్ తీయటంతో ఐర్లాండ్ 16 ఓవర్లలో 96పరుగులకే ఆలౌట్ అయ్యింది.
(Photo Credit: Getty Images)
4. హిట్ మ్యాన్ హిట్టింగ్ షో :
97పరుగుల స్వల్ప లక్ష్య చేధనతోనే బరిలోకి దిగిన ఐర్లాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన కింగ్ కొహ్లీ 1పరుగుకే వెనుదిరిగినా..కెప్టెన్ హిట్ మ్యాన్ మాత్రం అదరగొట్టాడు. 37 బంతుల్లో 4 సిక్సులు 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. 52పరుగుల వద్ద ఉన్నప్పుడు భుజానికి బంతి తగలటంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
5. రిషభ్ పంత్ ఫినిషింగ్ :
రోహిత్ శర్మ రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగినా మిగిలిన పనిని రిషభ్ పంత్ పూర్తి చేశాడు. 26బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 36పరుగులు చేయటంతో టార్గెట్ ను టీమిండియా 12.2ఓవర్లలో పూర్తి చేసి 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండియా ఈ వరల్డ్ కప్ లో తన తర్వాతి లీగ్ మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈ నెల 9వ తారీఖున ఆడనుంది. ఈ మ్యాచ్ టికెట్లను రికార్డు ధరలకు విక్రయించారు. దీనిపై సైతం విమర్శలు వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ తరువాత టీమిండియా ఆటగాళ్లు టీ 20 వరల్డ్ కప్ తో కొన్ని రోజులు బిజీ షెడ్యూల్‌లో ఉంటారు.