అన్వేషించండి

Junior Hockey World Cup : కీలక మ్యాచ్‌కు యువ భారత్‌ సిద్ధం , నేడే జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ సెమీస్‌

FIH Men's Hockey Junior World Cup 2023: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో అద్భుత విజయాలతో సెమీస్‌ చేరిన యువ భారత్‌ జట్టు అత్యంత కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో అద్భుత విజయాలతో సెమీస్‌ చేరిన యువ భారత్‌ జట్టు అత్యంత కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అద్భుత విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న యువ భారత జట్టు... పటిష్టమైన జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌ను 4-3తో చిత్తుచేసిన భారత్‌పై సెమీస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. హాకీ ప్రపంచకప్‌ దక్కించుకునేందుకు కేవలం రెండే అడుగుల దూరంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అస్త్ర శస్త్రాలు సిద్థం చేసుకుంటోంది. కెప్టెన్‌ ఉత్తమ్‌ సింగ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌పై రెండు గోల్స్‌తో అదరగొట్టిన వైస్‌ కెప్టెన్‌ అరిజీత్‌ సింగ్‌ హుండాల్‌ కూడా మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. వీరు మరోసారి రాణిస్తే భారత జట్టుకు విజయం కష్టమేమీ కాదు. ఏడాది జర్మనీతో 4 సార్లు తలపడిన భారత్‌.. నాల్గింట్లోనూ ఓడటం అతిపెద్ద ప్రతికూలాంశం. కానీ ఈ మెగా టోర్నీలో బలంగా కనిపిస్తున్న భారత్‌ను తక్కువ అంచనా వేయడం అంత సమంజసం కాదు. మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ తలపడుతుంది. 


 ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు వచ్చింది. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ ప్రదర్శన అబ్బురపరిచింది. ఆరంభంలో నెదర్లాండ్స్‌ దూకుడు ముందు తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు కీలక సమయంలో పుంజుకుని 4-3తో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ విజయం కష్టమని చాలామంది అంచనా వేయగా... బలమైన నెదర్లాండ్స్‌ను టీమిండియా ఓడించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఎంత బలంగా ఉన్నా చొచ్చుకుపోయే సత్తా కలిగిన జట్టు నెదర్లాండ్స్‌ను ఓడించిన యువ భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌లో యువ భారత్‌- నెదర్లాండ్స్‌ హోరాహోరీగా తలపడ్డాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నెదర్లాండ్స్‌ అయిదో నిమిషంలోనే గోల్‌ చేసి టీమిండియాకు షాక్‌ ఇచ్చింది. నెదర్లాండ్స్‌ స్ట్రైకర్‌ బోయర్స్‌ గోల్‌ చేశాడు. అనంతరం 16వ నిమిషంలో నెదర్లాండ్స్‌ మరో గోల్‌ చేసి 0-2 ఆధిక్యానికి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్‌లో  0-2 గోల్స్‌తో నెదర్లాండ్స్‌ ముందుండడంతో యువ భారత్‌ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 34వ నిమిషంలో అదిత్య గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతా తెరిచింది.

అనంతరం మరో రెండు నిమిషాలాకో పెనాల్టీ కార్నర్‌ను అరైజిత్‌ సింగ్‌ గోల్‌గా మలచడంతో స్కోరు 2-2తో సమమయ్యాయి. కానీ 44వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఆటగాడు ఒలివర్‌ గోల్‌ చేయడంతో డచ్‌ జట్టు మళ్లీ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో ఎనిమిది నిమిషాలకు సౌరభ్‌ కుష్యాహా చేసిన అద్భుత గోల్‌తో భారత్‌ స్కోరును 3-3తో సమం చేసింది. ఇక సమయం ముగుస్తుందనుకున్న దశలో భారత కెప్టెన్‌ ఉత్తమ్‌సింగ్‌ గోల్‌ చేసి టీమిండియాను 4-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ గోల్‌ తర్వాత నెదర్లాండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో గోల్‌ సాధించలేకపోయింది. ఓటమి ఖాయమనుకున్న దశలో జూనియర్‌ హాకీ జట్టు అద్భుత విజయంతో సెమీస్‌లోకి చేరింది.  జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో యువ భారత్‌(Bharat) శుభారంభం చేసింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. బలమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget