అన్వేషించండి
Advertisement
Ind vs EngTest: విశాఖలో టెస్ట్ మ్యాచ్, టికెట్ల అమ్మకం అప్పటి నుంచే
Ind vs EngTest: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుంది.
విశాఖ(Visakha)లో ఇండియా-ఇంగ్లాండ్(Ind vs EngTest) మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే 26నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా...ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.
పటిష్ట భద్రత
ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్, కలెక్టర్ మల్లికార్జున సహా ఏసీఏ సభ్యులు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
15 నుంచి ఆన్‌లైన్...26 నుంచి ఆఫ్‌లైన్
టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. పేటీఎం యాప్ ద్వారా ఆన్‌లైన్లో విక్రయిస్తామని, ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు వివరించారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా ఉంటుందన్నారు.
బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్
భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు(England Lions)... టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik ) బ్యాటింగ్ కన్సల్టెంట్( batting consultant)గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్ తొలి 9 రోజుల పాటు కార్తీక్ ఇంగ్లండ్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్ కోచ్ నీల్ కిలీన్ నేతృత్వంలో దినేశ్ కార్తీక్ పని చేస్తాడు.
టీమిండియా ఏ జట్టు ప్రకటన
ఇంగ్లండ్(England)తో టీమిండియా(Team India) టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(The Board of Cricket Control for India) BCCI భారత్ ఏ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement