T20 World Cup 2024: భారత్-బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్, ఎలా చూడచ్చు అంటే..
T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్ కు ముందు వార్మప్ మ్యాచ్ నేడు న్యూయార్క్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు భారత్ - బంగ్లాదేశ్ తలపడనున్నాయి.
India vs Bangladesh T20 World Cup Warm up Match: రేపటినుంచి క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురుచూసే టీ 20 వరల్డ్ కప్ (T 20 World cup) ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కు ముందు వార్మప్ మ్యాచ్ గా నేడు భారత్ - బంగ్లాదేశ్(India vs Bangladesh) లు న్యూయార్క్(New York) లో తలపడనున్నాయి. న్యూయార్క్ లో పొద్దున్న 10.30 నిమిషాలకు ఈ మ్యాచ్ జరగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. టీ 20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికాకు చేరుకున్నాయి. ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. వరల్డ్ కప్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జరగనున్న వార్మప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ + హాట్ స్టార్ లో చూడొచ్చు.
రెండు జట్ల మధ్య పోటీ ..
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ వార్మప్ పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్రపంచ కప్ కి ఒక ప్రోత్సాహకరమైన ప్రారంభాన్ని ఇవ్వాలని టీం ఇండియా కెప్టెన్ కోరుకుంటుండగా . యూఎస్ఏ తో జరిగిన సిరీస్ ఓటమిని అధిగమించడానికి, గ్రూప్-స్టేజ్‌కి వెళ్లే ముందే ఒక విజయాన్ని పొంది జట్టులో ఉత్సాహాన్ని నింపాలని బంగ్లాదేశ్ కెప్టెన్ కోరుకుంటున్నాడు.
మొత్తంగా 20 జట్లు ఈసారి ప్రపంచకప్ కోసం తలపడున్న నేపధ్యంలో మొత్తం ఉన్న టీమ్స్ నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్A గ్రూప్ B గ్రూప్ c గ్రూప్ D. గ్రూప్ A- ఇందులో మొత్తం ఐదు జట్లున్నాయి. మన ఇండియాతోపాటు పాకిస్థాన్ ఐర్లాండ్, కెనడా, ఇంకా ఆతిధ్య యూఎస్ఏ ఈ గ్రూప్ లో ఉన్నాయి.
గ్రూప్ డి - ఈ గ్రూప్లో కూడా 5 జట్లు ఉన్నాయి. అవి సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
ఇప్పుడు ఈ వార్మప్ పోరులో గ్రూప్ ఏ లో ఉన్న భారత జట్టు, గ్రూప్ డీ లో ఉన్న బంగ్లాదేశ్ జట్టుతో పోటీపడనుంది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహమూద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షాక్ మహిదీ హసన్, రిషాద్ హోస్సేన్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్
రిజర్వ్ బెంచ్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్
భారత క్రికెట్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ బెంచ్ : శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్