Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ఛాన్స్.. కీలకమైన ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక.. సిరీస్ పూర్తి షెడ్యూల్
Ind vs Aus Under 19 | ఇంగ్లాండ్ పర్యటనలో రాణించిన వైభవ్ సూర్యవంశీకి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది.

vaibhav suryavanshi selected for india u19 | ఆస్ట్రేలియా పర్యటన కోసం BCCI బుధవారం నాడు భారత అండర్-19 (Team India Under 19) జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేశారు. ఈ పర్యటన యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటేందుకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. సీఎక్కే (CSK) తరఫున అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే కెప్టెన్సీలో బీసీసీఐ 17 మంది ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసింది. 5 మంది స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాను కూడా సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 2 మల్టీ డే మ్యాచ్‌లు
సెప్టెంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా అండర్-19 టీంతో 3 వన్డేలు, 2 మల్టీ డే మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ చేశారు. మల్టీ డే మ్యాచ్ 4 రోజులపాటు జరుగుతుంది. సెప్టెంబర్ 21న మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ పర్యటనలో చివరి మల్టీ డే మ్యాచ్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగుతుంది. IPLలో అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్ట్ చేయగా.. చారిత్రాత్మక ప్రదర్శన చేసి అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్ 19 జట్టుకు ఆయుష్ మాత్రే సారథిగా వ్యవహరించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 100 పరుగులు, 6 లిస్ట్ A మ్యాచ్‌లలో 132 రన్స్, 8 T20లలో 265 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఆడిన 7 మ్యాచ్‌లు (5 వన్డేలు, 2 టెస్టులు)లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 445 పరుగులు చేశాడు. ఇందులో 143 పరుగుల చారిత్రాత్మక శతక ఇన్నింగ్స్ కూడా ఉంది. వైభవ్ కేవలం 78 బంతుల్లోనే ఆ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 10 సిక్సర్లు, 13 ఫోర్లు బాదడం విశేషం.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుండు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), డి. దీపేష్, నమన్ పుష్పక్, రాహుల్ కుమార్,హెనిల్ పటేల్, కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్, RS అంబరీష్, అన్మోల్జీత్ సింగ్, ఖిలాన్ పటేల్, అమన్ చౌహాన్, ఉధవ్ మోహన్.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) July 30, 2025
India U19 squad for tour of Australia announced.
The India U19 side will play three one-day games and two multi-day matches against Australia's U19 side.
Details 🔽 #TeamIndiahttps://t.co/osIWOaFA12
భారత్ vs ఆస్ట్రేలియా అండర్-19 షెడ్యూల్
- మొదటి వన్డే- సెప్టెంబర్ 21, ఆదివారం
- రెండవ వన్డే- సెప్టెంబర్ 24, బుధవారం
- మూడవ వన్డే- సెప్టెంబర్ 26, శుక్రవారం
- మొదటి మల్టీ డే మ్యాచ్- సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు
- రెండవ మల్టీ డే మ్యాచ్- అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు





















