By: ABP Desam | Updated at : 11 Feb 2023 12:46 PM (IST)
Edited By: nagavarapu
అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా (source: twitter)
IND vs AUS 1st test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84), షమీ (47 బుంతుల్లో 37) అద్భుతంగా రాణించి భారత్‌కు మంచి స్కోరు అందించారు. అక్షర్ కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు.
ఆదిలోనే దెబ్బ
321 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన భారత్ ను మర్ఫీ ఆదిలోనే దెబ్బతీశాడు. రెండో రోజు స్కోరుకు 4 పరుగులే జోడించిన జడేజాను 70 పరుగుల వద్ద మర్ఫీ బౌల్డ్ చేశాడు. అనంతరం అక్షర్ కు జతకలిసిన షమీ భారీ షాట్లు ఆడాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మర్ఫీ వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న షమీని... తర్వాత వేసిన ఓవర్‌లో మర్ఫీ బోల్తా కొట్టించాడు. కీపర్ క్యాచ్ ద్వారా షమీని ఔట్ చేశాడు. మరోవైపు అక్షర్ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించాడు. దీంతో భారత్ స్కోరు 400కు చేరుకుంది. ఆ వెంటనే అక్షర్ (84)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు.
Captain @ImRo45 led from the front with a magnificent century as he becomes #TeamIndia’s Top Performer from the first innings 👏🏻👏🏻
A summary of his batting display 👇🏻 #INDvAUS pic.twitter.com/bfCIwfI2kA — BCCI (@BCCI) February 11, 2023
రాణించిన బ్యాటర్లు
కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( 185 బంతుల్లో 70), అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84) లు రాణించటంతో ఆస్ట్రేలియా పై పైచేయి సాధించింది. సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
టాడ్ మర్ఫీ అదిరే అరంగేట్రం
ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఈ ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ 7 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే డీబట్ మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ గా రికార్డుల్లో నిలిచాడు.
జడేజా ఆల్ రౌండ్ షో
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. బంతితో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. బ్యాట్ తోనూ 70 పరుగులు చేశాడు. అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా జట్టు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia all out for 400. Lead by 223 runs.
— BCCI (@BCCI) February 11, 2023
Rohit Sharma (120)
Axar Patel (84)
Ravindra Jadeja (70)
Scorecard - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/iUvZhUrGL1
400 up for #TeamIndia 💪
— BCCI (@BCCI) February 11, 2023
Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/rgahexMTY6
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!
Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా