ICC Test Rankings: ఇదేందయ్యా ఇది! జస్ట్ 2 గంటలే నంబర్ వన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా!
ICC Test Rankings: టీమ్‌ఇండియా ఓ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది! కేవలం రెండు గంటలే టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది.
ICC Test Rankings:
టీమ్‌ఇండియా ఓ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది! కేవలం రెండు గంటలే టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. వెంటనే రెండో స్థానానికి పరిమితమైంది. ఐసీసీ సాంకేతిక తప్పిదమే ఇందుకు కారణం. దీనిని గమనించిన నెటిజన్లు వెంటనే ట్రోలింగ్ మొదలెట్టేశారు.
సాధారణంగా ప్రతి సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ ర్యాంకులు సవరిస్తుంది. గెలుపోటముల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది. బంగ్లాదేశ్‌తో తర్వాత టీమ్‌ఇండియా సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేదు. దక్షిణాఫ్రికాను 2-0తో ఓడించాక ఆసీస్ సైతం ఆడలేదు. చివరిసారిగా 2023, జనవరి 8న ర్యాంకులను ప్రకటించారు. ఓ చిన్న సాంకేతిక తప్పిదంతో వీరి ర్యాంకులు మారాయి. ఆసీస్ స్థానంలో టీమ్‌ఇండియా నంబర్ వన్‌గా కనిపించింది.
నెటిజన్లు ట్రోల్ చేయడంలో ఐసీసీ వెంటనే స్పందించింది. సాంకేతిక తప్పిదాన్ని సరి చేసింది. దాంతో ఆస్ట్రేలియా నంబర్ వన్, టీమ్‌ఇండియా నంబర్ 2లో కొనసాగుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో 29 మ్యాచులు ఆడిన ఆసీస్ 126 రేటింగ్ పాయింట్లతో ఉంది. 32 మ్యాచులాడిన భారత్ 115 రేటింగ్‌తో నిలిచింది. ఇంగ్లాండ్ 107 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది.
మరికొన్ని రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా అత్యంత కీలకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే నాలుగు టెస్టుల సిరీసు మొదలవుతోంది. టీమ్‌ఇండియా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆసీస్ 18 మందిని ఎంపిక చేసింది.
భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్, ఏస్టన్ ఆగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, లాన్స్ మోరిస్, టాడ్ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
View this post on Instagram