అన్వేషించండి

IND-W vs ENG-W : టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం , కొత్త చరిత్ర లిఖించిన భారత మహిళలు

India women vs England women: మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది.

మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది. ఏకంగా 347 పరుగుల తేడాతో బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. వుమెన్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. నాలుగు రోజులపాటు జరిగే...... టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంతకుముందు ఏ జట్టు ఇంత భారీ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో.... 428 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా  6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం... బ్రిటీష్‌ మహిళల జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూల్చి... 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు నేలకూల్చి దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా దీప్తి శర్మ ఎంపికైంది.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్ట్‌ ఆడుతున్న అరంగేట్ర బ్యాటర్ శుభా సతీష్‌ 76 బంతుల్లో 69 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్‌  99 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ 81 బంతుల్లో 49 పరుగులు చేసిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు ముందు అవుటై నిరాశ పరిచింది. కానీ యాస్తిర్‌ బాటియా 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 66 పరుగులు చేసి సత్తా చాటింది. వీరిద్దరూ భాగస్వామ్యంతో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 313 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 67 పరుగులు చేసింది. 7 వికెట్లకు 410 పరుగులతో భారత్‌ తొలి రోజును ముగించింది. రెండో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే 428 పరుగులకు ఆలౌటైంది. దీప్తి 113 బంతుల్లో 67 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 7 పరుగులు మాత్రమే జోడించి దీప్తి వెనుదిరిగింది. ఎకిల్‌స్టోన్‌ ధాటికి టీమిండియా ఓవర్‌ నైట్‌ స్కోరుకు మరో పద్దెనిమిది పరుగులు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చాక ఇంగ్లాండ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి.  దీప్తి, స్నేహ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 28 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ (5/7) స్పిన్‌ మాయలో చిక్కుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్‌ రాణా (2/25) కూడా ఆకట్టుకుంది.
 ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ స్మృతి వికెట్‌తో భారత్‌ను ఎకిల్‌స్టోన్‌ తొలి దెబ్బ కొట్టింది. జెమీమా (27), హర్మన్‌ప్రీత్‌ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 133/6తో నిలిచిన జట్టును పూజ (17 బ్యాటింగ్‌)తో కలిసి హర్మన్‌ ఆదుకుంది. 133 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 186 పరుగులకు డిక్లేర్‌ చిసింది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 479 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. మరోసారి దీప్తి శర్మ స్పిన్‌తో మాయ చేయడంతో ఇంగ్లాండ్‌ 131 పరుగులకే కుప్పకూలింది. దీప్తి నాలుగు వికెట్లతో రాణించింది. దీంతో 347 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget