అన్వేషించండి

India vs England: కోహ్లీ లేకుండానే జట్టు, మిగిలిన టెస్టులకు టీమ్‌ ఇదే

India vs England Test Squad: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు. అందుబాటులోకి రాకపోడవంతో కోహ్లీ జట్టులోకి తీసుకోలేదు. 

Indias Squad Announcement For Last Three Tests: స్వదేశంలో ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో స్టార్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)సెలక్షన్‌ కమిటీకి అందుబాటులోకి రాకపోడవంతో అతడిని జట్టులోకి తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ మిగిలిన సిరీస్‌ల ఎంపికకు అందుబాటులో ఉండడని బీసీసీఐ(Bcci) సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని... మద్దతుగా నిలుస్తుందని బీసీసీఐ వెల్లడించింది. రవీంద్ర జడేజా, KL రాహుల్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసినా... వైద్య బృందం పరిశీలించిన ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ ఇస్తేనే తుది జట్టులో స్థానం దక్కుతుందని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. గాయంతో శ్రేయస్స్‌ అయ్యర్‌పై ఈ  మూడు టెస్టులకు చోటు దక్కలేదు. తెలుగు కుర్రాడు భరత్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. మూడో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారన్న వార్తలు పటాపంచలు చేస్తూ ఈ పేసు గుర్రాన్ని మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారు. 
 
ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కె.ఎస్. భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
 
ఇందుకే అయ్యర్‌ దూరం
శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)కు పాత గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్‌.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో చేరినట్లు తెలుస్తోంది. అయ్యర్‌ తిరిగి మళ్లీ ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అయ్యర్‌ అంచనాలను అందుకో లేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అయ్యర్‌ దూరమవ్వడంతో అతని స్థానంలో దేశవాళీలో పరుగుల వరద పాలిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(sarfaraz khan)కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ మిగిలిన టెస్టులకు దూరమయ్యాడు. ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు.. ఈనెల 23 నుంచి రాంచీ నాలుగో టెస్ట్‌... మార్చి 7 నుంచి ధర్మశాలలో అయిదో టెస్ట్‌ జరగనున్నాయి. 
 
తుది జట్టులో జడ్డూ కూడా కష్టమే....?
తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన  రవీంద్ర జడేజా తుది జట్టులో చేరడం కష్టంగా తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్‌ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget