IND vs ENG Test 2025: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్: భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ సహా పూర్తి వివరాలు ఇక్కడే!
IND vs ENG Test 2025: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ లీడ్స్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

IND vs ENG Test 2025 Live Streaming: భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. భారత జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్ జట్టుతో వారు తలపడనున్నారు. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మొదటి టెస్ట్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ లో చూడవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
మొదటి టెస్ట్ ఎప్పుడు ఆడతారు?
భారత్ -ఇంగ్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ ఇవాళ్టి నుంచి జూన్ 24 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందు 3:00 గంటలకు వేస్తారు..
మొదటి టెస్ట్ ఎక్కడ ఆడతారు?
భారత్ -ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతుంది.
ఏ ఛానెల్‌లో మ్యాచ్‌ను లైవ్ లో చూడవచ్చు
భారత్ -ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తోంది. ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ వివిధ భాషల్లో ఉంటుంది.
ఏ యాప్‌లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది
భారత్ -ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ జియోహోట్‌స్టార్‌లో ఉంటుంది.
హెడింగ్లీ పిచ్ నివేదిక
మొదటి మ్యాచ్ హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. కానీ బంతి పాతబడిన కొద్దీ స్పిన్ బౌలింగ్ ఆధిపత్యం చెలాయిస్తుంది. లీడ్స్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన స్వింగ్ పొందవచ్చు, ఒకవేళ అలా జరిగితే బ్యాట్స్‌మెన్‌లకు కష్టాలు తప్పవు.
మొదటి మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11
ఇంగ్లాండ్- జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రాడెన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
భారతదేశం యొక్క ప్లేయింగ్ 11- యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారతదేశం vs ఇంగ్లాండ్ 2025 టెస్టు సిరీస్‌కు సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు.
మొదటి టెస్ట్ - జూన్ 20, హెడింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్ - జూలై 2, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్ట్ - జూలై 10, లార్డ్స్, లండన్
4వ టెస్ట్ - జూలై 23, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్ట్ - జూలై 31, ది ఓవల్, లండన్
శుభ్‌మన్ గిల్ 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకగలరా?
రాహుల్ ద్రవిడ్ సేన చరిత్ర సృష్టించిన 2007 తర్వాత ఇంగ్లాండ్‌లో భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఇప్పుడు, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టుతో ఆ 18 ఏళ్ల కరవును తీర్చుకోవాలనే నిజమైన అవకాశం వచ్చింది. పూర్తి స్థాయి పేస్ అటాక్, ఫామ్‌లో ఉన్న మిడిల్ ఆర్డర్‌తో, మొదటి టెస్ట్ నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఊపు తెచ్చుకోవడం భారత్‌కు సవాలు.




















