India vs England:భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? రేసులో ఉన్న బౌలర్లు ఎవరు?
India vs England:భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసే టాప్ 4 ఆటగాళ్లకు గట్టి పోటీయే ఉంది.

India vs England: భారత్,, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ శుక్రవారం, అంటే ఇవాళ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లోని హెడింగ్లీలో జరుగుతుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లలోనూ ఒకరితో ఒకరు పోటీ పడే వరల్డ్ నెంబర్ వన్ బౌలర్లు ఉన్నారు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, అతనికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. బుమ్రా ఇక్కడ చాలా వికెట్లు తీశాడు. అదే సమయంలో, ఇంగ్లాండ్ జట్టుకు అనుభవజ్ఞుడైన బౌలర్ క్రిస్ వోక్స్ పెద్ద అండ అని చెప్పవచ్చు. అతను చాలా కాలంగా ఇంగ్లాండ్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు బౌలర్లు అత్యధిక వికెట్లు తీసేందుకు బలమైన పోటీదారులుగా ఉన్నారు.
భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసేందుకు 4 ప్రధాన పోటీదారులు
1- జస్ప్రీత్ బుమ్రా- భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 200 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అతనికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఇంగ్లాండ్‌లో బుమ్రా చాలా వికెట్లు తీశాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, బుమ్రా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీస్తే, అది పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
2- క్రిస్ వోక్స్- ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్‌లో క్రిస్ వోక్స్ అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ళలో ఒకడు. వోక్స్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో 181 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అతనిపై చాలా బాధ్యత ఉంటుంది. అతను భారత్‌పై పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు మరోసారి భారత్‌తో సిరీస్‌లో బాగా రాణిస్తుందని ఆశిస్తోంది.
3- మహ్మద్ సిరాజ్- భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్ట్ క్రికెట్‌లో 100 వికెట్లు తీశాడు. అతను రెండు వైపులా బంతిని స్వింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అతను కూడా ఈ టెస్ట్ సిరీస్‌లో చాలా వికెట్లు తీయవచ్చు.
4- షోయబ్ బషీర్- ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ షోయబ్ బషీర్‌పై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. అతను జట్టుకు ప్రధాన స్పిన్నర్. బషీర్‌కు ఇంగ్లాండ్‌లో బౌలింగ్ చేసిన మంచి అనుభవం ఉంది. అతను సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లకు ప్రమాదకరంగా మారవచ్చు.
మరోవైపు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మాన్ గిల్‌పై అందరి దృష్టి ఉంటుంది. ఈ సిరీస్ భారతదేశం రెడ్-బాల్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది, టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో గత ఒడిదుడుకులను అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు - హెడింగ్లీలో మంచి ప్రదర్శన చేస్తుందని అంటున్నారు.
హెడింగ్లీలో భారత జట్టు రికార్డు
హెడింగ్లీలో మొత్తం భారత్ ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఈ చారిత్రాత్మక వేదికపై భారత్ ట్రాక్ రికార్డ్ అంత అద్భుతంగా ఏం లేదు. ఇక్కడ కేవలం రెండు మాత్రమే గెలిచింది, నాలుగు ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
భారతదేశం తొలిసారి 1952లో ఈ మైదానంలో ఆడింది, ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. లాస్ట్ టైం 2021లో జరిగింది. అప్పుడుకూడా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. చివరి సారిగా హెడింగ్లీలో భారత్ 2002లో విజయం సాధించింది.




















