India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల- 2 సార్లు తలపడనున్న భారత్, పాకిస్తాన్- ఫైనల్ చేరితే 3 మ్యాచ్‌లు
Ind vs Pak Asia Cup 2025 Schedule | భారత్-పాక్ 2025 ఆసియా కప్ లో 2 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఫైనల్ కు చేరితే రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది.

India and Pakistan clash in Asia Cup 2025 | ఆషియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండుసార్లు తలపడనున్నాయి. ఒకవేళ రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటే భారత్, పాక్ జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంటుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వి శనివారం నాడు (జులై 26న) ఆసియా కప్ షెడ్యూల్ ను ప్రకటించారు. ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు.
సెప్టెంబర్ 9న ఆసియా కప్ ప్రారంభం
ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వి ఆసియా కప్ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, "UAEలో ACC పురుషుల ఆసియా కప్ 2025 తేదీలను ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో అద్భుతమైన క్రికెట్ మ్యాచులు చూస్తామని ఆశిస్తున్నాం. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.
Asia Cup 2025 Schedule announced | India to face Pakistan on 14th September, 2025.
— ANI (@ANI) July 26, 2025
India, Pakistan, UAE, Oman in Group A
Bangladesh, Sri Lanka, Afghanistan, and Hong Kong in Group B pic.twitter.com/bZVUzHwVAw
సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్, ఆ తర్వాత...
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. ఇది లీగ్ దశ మ్యాచ్. ఆ తర్వాత సెప్టెంబర్ 21న రెండు జట్లు సూపర్-4లో భాగంగా మరోసారి తలపడతాయి. ACC నిర్వాహకులు, బ్రాడ్ కాస్టర్స్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత్, పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచారు. సూపర్ 4 దశలో కూడా ఈ జట్లు తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటే కనుక ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత్, పాక్ జట్ల మధ్య మూడో మ్యాచ్ సైతం జరిగే అవకాశం ఉంది.
Men's Asia Cup T20 tournament will be held in the UAE from September 9 to 28: Asian Cricket Council chairman Mohsin Naqvi pic.twitter.com/yuwzqN7JpO
— Press Trust of India (@PTI_News) July 26, 2025
జూలై 24న జరిగిన ACC సమావేశంలో ఆసియా కప్ వేదికను ఫిక్స్ చేశారు. దీనికి సభ్య దేశాలు కూడా హాజరయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను BCCI నిర్వహిస్తుంది. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తత కారణంగా 2027 వరకు తటస్థ వేదికలలో మాత్రమే పోటీ పడాలని రెండు దేశాలు అంగీకరించినందున UAEలో ఆసియా కప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశం, శ్రీలంకలో జరగనున్న T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆసియా కప్ ఫార్మాట్ సాధారణంగా ICC తరువాత వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆధారంగా నిర్ణయిస్తుంటారు.





















