అన్వేషించండి
Advertisement
India Vs Bangladesh: బంగ్లాపై శతక వీరులు వీరే
ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనుంది.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా రేపు(గురువారం) బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వరుస విజయాలతో రోహిత్ సేన దూకుడుగా ఉంది. అయితే ప్రపంచకప్‌లో టీమిండియాతో నాలుగుసార్లు తలపడిన బంగ్లాదేశ్ ఈ మూడుసార్లు పరాజయం పాలై ఒకసారి విజయం సాధించింది. ప్రపంచకప్‌లలో బంగ్లాపై టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలు నమోదు చేయగా... ఒక్క బంగ్లా బ్యాటర్ కూడా భారత్‌పై శతకం నమోదు చేయలేదు. ఒకసారి ఆ సెంచరీలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుందాం.
వీరేంద్ర సెహ్వాగ్
2011ప్రపంచకప్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. బంగ్లాదేశ్ బౌలింగ్ దాడిని చీల్చిచెండాడి భారీ శతకాన్ని నమోదు చేశాడు. సెహ్వాగ్ ఆ మ్యాచ్‌లో 140 బంతుల్లో 14 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్‌తో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోరు చేసింది.
విరాట్ కోహ్లీ
ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 83 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. నాలుగో వికెట్‌కు సెహ్వాగ్‌తో కలిసి 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు.
రోహిత్ శర్మ
2015, 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌పై వరుస సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ ఈ రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలతో 120.50 సగటుతో 241 పరుగులు చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌పై రోహిత్ తొలిసారి సెంచరీ చేశాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అతను 126 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. 2019 బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో 92 బంతుల్లో 104 పరుగులు చేసి సెంచరీని సాధించాడు. ఇప్పటికే బంగ్లాపై రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే గురువారం జరిగే మ్యాచ్‌లో మరో భారీ శకతం ఖాయంగా కనిపిస్తోంది.
2007లో తొలిసారిగా ప్రపంచకప్‌లలో భారత్-బంగ్లా తలపడ్డాయి. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో తొలిసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. మష్రఫే మొర్తజా, తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్ రాణించడంతో 2007లో భారత్‌పై బంగ్లా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతీ ప్రపంచకప్‌లోనూ భారత్ విజయం సాధించింది. 2011, 2015, 2019లో మూడుసార్లు బంగ్లాపై టీమిండియా గెలిచింది. ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఎవరూ సెంచరీ చేయలేదు. మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో 2011లో జరిగిన మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ 70 పరుగులు చేశాడు. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో భారత్‌పై బంగ్లా బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ ప్రపంచకప్‌లోనూ ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింట్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటినుంచి బంగ్లాదేశ్‌కు ప్రతీ మ్యాచ్ కీలకం కావడంతో భారత్‌పై విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. కానీ అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమిండియాను బంగ్లా పులులు అడ్డుకోవడం అంత తేలిక కాదని మాజీలు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement